ఏపీ ప్రజలకు అలర్ట్: ప్రభుత్వ ఆఫీసుల్లో టైమింగ్స్‌ మారాయ్.. వివరాలివే!

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు పడిపోతున్న తరుణంలో సోమవారం నుంచి టైమింగ్స్ మారిపోనున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ సడలింపుల్లో భాగంగా సోమవారం (జూన్ 21) నుంచి ప్రభుత్వ ఉద్యోగుల పనివేళల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తూర్పు గోదావరి జిల్లా మినహా మిగిలిన ప్రాంతాల్లో ఉద్యోగుల పని వేళలు మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

సోమవారం నుంచి తూర్పు గోదావరి జిల్లాలో ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పనివేళలుగా నిర్ణయించినట్లు సీఎస్ ఆదిత్యనాథ్ తెలిపారు. మిగిలిన 12 జిల్లాల్లోని అన్ని ప్రాంతాలన్నింటిలోనూ కార్యకలాపాలు కోవిడ్‌ ముందున్న సమయాల తరహాలోనే కొనసాగనున్నాయి.

ఏపీ కర్ఫ్యూ వేళల్లో మార్పు.. ఇక, సాయంత్రం 6 వరకు.. ఈ ఒక్క జిల్లాలో తప్ప.. నిబంధనలివే!
సోమవారం నుంచి ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగులకు పని వేళలుగా నిర్ణయించారు. ఈ నెల 30వ తేదీ వరకు ఈ పనివేళలే వర్తిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల్లో తెలిపింది. అన్ని విభాగాధిపతులు, కలెక్టర్లు ఈ ఆదేశాలు అమలు చేయాలని సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

WTC Finalలో మూడో రోజు భారత్‌కి నిరాశ.. తేలిపోయిన బుమ్రా

Mon Jun 21 , 2021
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో ఆదివారం అటు బ్యాటింగ్‌లో.. ఇటు బౌలింగ్‌లోనూ భారత్ జట్టు నిరాశపరిచింది. అశ్విన్, ఇషాంత్ చెరొక వికెట్ పడగొట్టగా.. బుమ్రా మాత్రం