ఏపీలో వాహనదారులకు జగన్ సర్కార్ శుభవార్త.. బిగ్ రిలీఫ్

సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం పన్ను చెల్లింపు గడువును జూన్‌ 30 వరకు పొడిగించింది. ఈ మేరకు రవాణ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఏపీలో వాహనదారులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. మోటారు వాహన పన్ను చెల్లింపు గడువును ప్రభుత్వం జూన్‌ 30 వరకు పొడిగించింది. ప్రస్తుత త్రైమాసిక పన్నును ఏప్రిల్‌ 30లోగా చెల్లించాల్సి ఉంది.. కరోనా తీవ్రత ఉండటంతో పన్ను చెల్లింపు గడువును పొడిగించాలని లారీ యజమానుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం పన్ను చెల్లింపు గడువును జూన్‌ 30 వరకు పొడిగించింది. ఈ మేరకు రవాణ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

వెహికల్ ట్యాక్స్ అడ్వాన్స్‌గా చెల్లిస్తుంటారు.. ప్రతి త్రైమాసికానికి ఈ చెల్లింపులు చేయాలి. సకాలంలో వెహికల్ ట్యాక్స్ చెల్లించని పక్షంలో జరిమానా విధిస్తారు. అదికూడా 50 శాతం నుంచి 200 శాతం వరకు ఉంటాయి.. ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ట్యాక్స్ చెల్లింపుల విషయంలో వెసులుబాటు కల్పించాలని విన్నపాలు వచ్చాయి. కరోనా పరిస్థితులు, వాహనదారులవిన్నపాన్ని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. వాహనదారులకు స్వల్ప ఊరట కల్పించింది.

లారీ యజమానులకు ఉన్న ఇబ్బందులతో రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలల పాటు గడువిస్తూ వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల లారీ యజమానుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. తమ సమస్యలను తెలుసుకుని రెండు నెలల పాటు గడువు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పన్ను చెల్లించేందుకు జూన్ 30 వరకు ఉండటం ఊరటనిచ్చింది అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఢిల్లీ: కట్టె కాల్చడానికి మరుభూమీ కరువు.. రెండు మూడు రోజుల నిరీక్షణ

Tue Apr 27 , 2021
Covid Cases in Delhi ఢిల్లీలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చడంతో కోవిడ్ రోగులను ఆస్పత్రుల్లో చేర్చుకోడానికి కూడా ఖాళీలేని పరిస్థితి నెలకుంది. అటు మార్చురీల్లోనూ శవాలు గుట్టలుగా పడుతున్నాయి.