ఏపీ అప్పు నెలకు రూ.5వేల కోట్లు… ప్రభుత్వానికి భారంగా మారిన సంక్షేమ పథకాలు

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక అవసరాల నిమిత్తం నెలకు రూ.5వేల కోట్లు అప్పు చేయాల్సిన పరిస్థితి నెలకొందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఇందులో సింహభాగం ప్రజలకే పంపిణీ చేస్తున్నామన్నారు.

ప్రధానాంశాలు:నెలకు రూ.5వేల కోట్ల అప్పు చేస్తున్న ఏపీ సర్కార్సంక్షేమ పథకాల పేరుతో భారీ అప్పులుఅందరి మాదిరిగానే తామూ చేస్తున్నామంటున్న మంత్రి సంక్షేమ పథకాల అమలు, ఇతర ఖర్చుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా రూ.5వేల కోట్ల అప్పు చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. తమకున్న పరిమితి మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రం అప్పులు చేస్తున్న విధంగానే తామూ చేస్తున్నామని పేర్కొన్నారు. అప్పుతో సేకరించిన నిధులను ప్రజా సంక్షేమ పథకాల కింద పేదలకే ఇస్తున్నామన్నారు.

Also Read: సీఎస్ దాస్ ఆగ్రహం.. సీఎం సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాశ్‌‌‌ అధికారాలన్నీ కట్

ప్రతినెలా సంక్షేమ పథకాలు, జీతాలు, పింఛన్లు, వడ్డీ-అసలు చెల్లింపులకు రాష్ట్ర సొంత ఆదాయం, కేంద్రం నుంచి వచ్చిన అనేక రకాల నిధులూ సరిపోవడం లేదని… ఫలితంగా ప్రతినెలా రూ.5,000 కోట్ల వరకు రుణంపై ఆధారపడాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయని బుగ్గన తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో బహిరంగ మార్కెట్‌ రుణం డిసెంబరు వరకు ఇక పరిమితి రూ.3,000 కోట్ల వరకే ఉందన్నారు. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.4,100 కోట్ల మేర గ్యారంటీల ఆధారంగా అప్పులూ తీసుకున్నామని తెలిపారు.

Also Read: ‘సీఎం జగన్‌ బెయిల్‌ రద్దు’… ఉలిక్కిపడిన వైసీపీ, రంగంలోకి సీఐడీ

2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఇచ్చే గ్యారంటీల మొత్తం పరిమితి రూ.1,06,200 కోట్లకు మించకూడదు. ఇప్పటికే ఆ మేరకు ప్రభుత్వం గ్యారంటీలు కల్పించింది. దీంతో ఆ రూపేణా రుణం పొందే మార్గాలు సన్నగిల్లాయి. దీంతో రిజర్వు బ్యాంకు కోత పెట్టిన రుణ పరిమితి నుంచి మినహాయింపు పొందే ప్రయత్నాలు, అందుకు అవసరమైన వాదన ఆర్థికశాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఇదేం టర్న్ బాబోయ్..? నోరెళ్లబెట్టేసిన పాకిస్థాన్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్

Wed Jul 14 , 2021
ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా పడిన బంతిని ముందుకు ఫుష్ చేసేందుకు ఇమామ్ ఉల్ హక్ ప్రయత్నించాడు. కానీ.. ఊహించని విధంగా టర్న్ అయిన బంతి అతని బ్యాట్‌కి అందుకుండా వెనక్కి మిడిల్ స్టంప్‌ని గీరాటేసింది.