ఏపీ ప్రజలకు సీఎం జగన్ గ్రేట్ న్యూస్: ఒక్కొక్కరికి ఉచితంగా 10 కేజీల బియ్యం.. ఇంటి వద్దకే..!

కరోనా వైరస్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలను ఆదుకునేందుకు జగన్ సర్కారు ముందుకొచ్చింది.

కరోనా వైరస్ మహమ్మారి అల్లకల్లోలం రేపుతున్న పరిస్థితుల్లో దారిద్ర్యరేఖకు దిగువున ఉన్న వారికి ఆపన్న హస్తం అందించేందుకు జగన్ ప్రభుత్వం ముందుకొచ్చింది. తెల్లరేషన్‌ కార్డు ఉన్నవారికి ఉచితంగా బియ్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1.47 కోట్ల మంది లబ్ధిదారులకు 2 నెలల పాటు ఉచితంగా బియ్యం ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

రాష్ట్రంలో 88 లక్షల మందికి ఉచితంగా బియ్యం ఇవ్వాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, కేంద్ర ప్రభుత్వ లబ్ధి అందని 59 లక్షల కార్డు దారులకు మే, జూన్‌ నెలలో ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున పంపిణీ చేయనున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు.

అంటే, మొత్తంగా కేంద్రం ఇచ్చే 5 కేజీల బియ్యానికి అదనంగా మరో 5 కేజీలను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది. ఇక, రేషన్‌ వాహనాల ద్వారానే ఉచిత బియ్యం పంపిణీ చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. రెండు నెలకు సంబంధించిన రేషన్‌ను ఒకేసారి డబుల్‌ కోటాగా పంపిణీ చేయనున్నారు. బియ్యం పంపిణీ కోసం రూ.764 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

కరోనా ఎఫెక్ట్: దక్షిణ మధ్య రైల్వే షాకింగ్ నిర్ణయం

Mon Apr 26 , 2021
కరోనా ప్రభావంతో ప్రయాణికులు సంఖ్య తగ్గడంతో దక్షిణ మధ్య రైల్వే కీలక నిరణయం తీసుకుంది. పలు మార్గాల్లో నడుపుతున్న ఆయా రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.