ఇసుక రీచ్‌ల పేరిట భారీ మోసం… ఐఏఎస్ అధికారి సంతకాన్నే ఫోర్జరీ చేసిన కేటుగాడు

ప్రభుత్వం అమలు చేస్తున్న తీరు గురించి పూర్తిగా తెలుసుకున్న కాకినాడకు చెందిన రామకృష్ణ సతీష్ కుమార్ అనే వ్యక్తి ఈ ఫోర్జరీకి పాల్పడి కోట్లు దండుకున్నాడు.

ప్రధానాంశాలు:ఏపీలో ఇసుక రీచ్‌ల పేరిట భారీ మోసం గోపాలకృష్ణ ద్వివేది సంతకాలు ఫోర్జరీనిందితుడిపై విజయవాడలో కేసు నమోదుఏపీలో ఇసుక దుమారం కొనసాగుతోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న ఇసుక పాలసీపై విమర్శలు రావడంతో తాజాగా ఇసుక తవ్వకాలకు ఈ-పర్మిట్‌ను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇదే సమయంలో ఇసుక రీచ్‌ల పేరిట చోటు చేసుకున్న భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఏపీ వ్యాప్తంగా ఇసుక రీచుల్లో తవ్వకాలు సబ్ లీజులు ఇస్తామంటూ ఏకంగా రూ.3.50 కోట్లు కొట్టేసిన చేసిన మోసగాడి వ్యవహారం బయట పడింది. గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది సంతకాలు ఫోర్జరీ చేసి డాక్యుమెంట్స్ సృష్టించి ఈ మోసానికి పాల్పడినట్లుగా తేలింది.

ఆంధ్రప్రదేశ్‌‌లో ఇసుక రీచ్‌ల వేలం కాంట్రాక్టును ప్రభుత్వం జేపీ గ్రూపునకు ప్రభుత్వం అప్పగించింది. దీంతో ప్రభుత్వం అమలు చేస్తున్న తీరు గురించి పూర్తిగా తెలుసుకున్న కాకినాడకు చెందిన రామకృష్ణ సతీష్ కుమార్ అనే వ్యక్తి ఫోర్జరీకి పాల్పడి కోట్లు దండుకున్నాడు. ఈ ఫోర్జరీ సంతకాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఏడుగురు బాధితుల నుంచి 3.50 కోట్లు వసూలు చేసినట్లు విచారణతో తేలింది. దీంతో జేపీ గ్రూప్ మేనేజర్ హర్ష కుమార్ ఫిర్యాదు మేరకు విజయవాడలోని భవానీపురం పోలీసులు నిందితుడిపై 471, 420, 465, 469, 471, 120 బి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతడి బ్యాంక్ అకౌంట్లలో ఉన్న రూ.2కోట్లను సీజ్ చేశారు. రామకృష్ణపై హైదరాబాద్‌లోనూ గతంలో ఫోర్జరీ కేసు నమోదైంది. ఆర్ధిక శాఖ కార్యదర్శి సంతకం ఫోర్జరీ చేశాడంటూ రామకృష్ణపై 2018లో సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

అక్కడ ఫిర్యాదులు, ఇక్కడ లేఖలు.. అంతుచిక్కని రఘురామ ట్విస్టులు

Thu Jun 10 , 2021
వైసీపీకి కంటిలో నలుసులా తయారైన సొంత పార్టీ ఎంపీ రఘు రామకృష్ణ రాజు మరో సంచలనానికి తెరలేపారు. ఇప్పటికే పరిస్థితి ఉప్పూనిప్పులా ఉంటే.. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలంటూ సీఎం జగన్‌ని టార్గెట్ చేస్తూ లేఖ రాయడం సంచలనంగా మారింది.