ఏపీలో అల్లకల్లోలం రేపుతున్న కరోనా: ఒక్క రోజే 69 మరణాలు.. 12 వేలకు పైగా కేసులు!

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. ఒక్క రోజే 69 మరణాలు సంభవించాయి.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ మహమ్మారి అల్లకల్లోలం రేపుతోంది. రోజురోజుకీ కరోనా వైరస్ బారిన పడుతున్న బాధితుల సంఖ్య వేలల్లో పెరుగుతోంది. మృతుల సంఖ్య సైతం పదుల సంఖ్యలో పెరుగడం ఆందోళన రేకెత్తిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 62,885 పరీక్షలు నిర్వహించగా.. ఏకంగా 12,634 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 10,33,560 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.

అలాగే కరోనా మహమ్మారి బారిన పడి గడిచిన 24 గంటల్లో 69 మంది ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్‌తో కృష్ణా జిల్లాలో అత్యధికంగా 12 మంది ప్రాణాలు కోల్పోగా.. నెల్లూరులో ఏడుగురు; తూర్పు గోదావరి, శ్రీకాకుళం, విశాఖ, పశ్చిమ గోదావరిలో ఆరుగురు చొప్పున; అనంతపురం, కడప ఐదుగురు చొప్పున; చిత్తూరు, గుంటూరులో నలుగురేసి; ప్రకాశం, విజయనగరంలో ముగ్గురు చొప్పున; కర్నూలులో ఇద్దరు మరణించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,685కి చేరింది.
అలాగే గడిచిన 24 గంటల వ్యవధిలో 4,304 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 9,36,143కి చేరినట్లు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 89,732 యాక్టివ్‌ కేసులున్నాయి. అత్యధికంగా శ్రీకాకుళంలో 1,680 కేసులు నమోదు కాగా.. అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 331 మంది వైరస్‌ బారినపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,59,31,722 నమూనాలను పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

కరోనాకీ బెదరని కేరళ వధువు.. కోవిడ్ వార్డులో కల్యాణం.. షాకింగ్

Sun Apr 25 , 2021
కాబోయే భర్తకి కరోనా అని తెలిసినా ఆ యువతి కంగారుపడలేదు. కరోనానే బెదిరిపోయేలా ఏకంగా కోవిడ్ వార్డే కాసేపు కల్యాణ మండపంగా మారిపోయింది. మనసిచ్చిన వాడితో మనువు జరిగిపోయింది.