జగన్ సర్కారుకు ఏపీ హైకోర్టు భారీ షాక్.. ఆ జీవో సస్పెండ్!

జగన్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు మరోసారి షాకిచ్చింది. జీవో నంబర్ 2ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

జగన్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరోసారి భారీ షాకిచ్చింది. గ్రామ సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శుల అధికారాల్లో కొన్నింటిని వీఆర్వోలకు బదిలీ చేస్తూ మార్చి 25వ తేదీన ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్‌ 2ను హైకోర్టు సస్పెండ్‌ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. గుంటూరు జిల్లా తోకలవానిపాలెం సర్పంచ్‌ కృష్ణమోహన్‌ దాఖలు చేసిన వ్యాజ్యంపై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది.

ప్రభుత్వం జారీ చేసిన జీవో పంచాయితీ కార్యదర్శుల హక్కుల్ని హరించేలా ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 73 సవరణకు, ఏపీ పంచాయితీ రాజ్ చట్టానికి వ్యతిరేకంగా జీవో ఉందని కోర్టుకు తెలిపారు. సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు వీఆర్వో వ్యవస్థను ఏర్పాటు చేశామని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరువురి వాదనలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

దీనిపై గతంలోనూ ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. గ్రామ పంచాయతీ కార్యాలయాలు, సర్పంచ్‌ల వ్యవస్థ ఉండగా.. సమాంతరంగా గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయడం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. సంక్షేమ పథకాలను పంచాయతీల ద్వారా ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్లకూడదని అడిగింది. రాష్ట్రానికి ముఖ్యమంత్రికి ఎలా అధిపతినో.. పంచాయతీలకు సర్పంచ్‌ కూడా అలాగేనని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

కొత్త ఫాస్ట్ చార్జర్ లాంచ్ చేసిన ఎంఐ.. ధర ఎంతంటే?

Mon Jul 12 , 2021
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ కొత్త ఫాస్ట్ చార్జర్‌ను లాంచ్ చేసింది. అదే ఎంఐ 67W సోనిక్ చార్జ్ 3.0 చార్జర్ కాంబో. దీని ధరను రూ.1,999గా నిర్ణయించారు.