జగన్ సర్కార్ కీలక నిర్ణయం… అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లు

ఏపీలో అగ్రవర్ణపేదలకు రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అగ్రవర్ణాలకు చెందిన పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. విద్యా, ఉద్యోగాల్లో ఈ 10 శాతం రిజర్వేషన్లు వర్తించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

ప్రధానాంశాలు:అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు విద్య, ఉద్యోగ రంగాల్లో 10 శాతం రిజర్వేషన్లుఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయంఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణాల్లోని పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. అగ్రవర్ణాల పేదలకు విద్య, ఉద్యోగ రంగాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అంగీకరిస్తూ ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు వర్తింపచేయాలని గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వార్షిక ఆదాయం రూ. 8లక్షల లోపు ఉన్న అగ్ర వర్ణాలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లను అమలు చేసే ప్రతిపాదనకు జనవరి 2019లోనే కేబినెట్ ఆమోదం తెలిపింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15, 16 లను అనుసరించి సామాజిక, విద్యా పరంగా వెనకబడిన వర్గాలకు విద్యా, ఉద్యోగాలలో ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో రిజర్వేషన్లు అమలు చేసేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

దానికి అనుగుణంగా అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి బుధవారం బుధవారం(14 జులై 2021) అర్థరాత్రి జీవో (66/2021) విడుదల చేసింది. రూ.8 లక్షల లోపు వార్షిక ఆదాయం కలిగిన వారికి రిజర్వేషన్లు వర్తించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని బ్రాహ్మణ, రెడ్డి, కమ్మ, వైశ్య, కాపు, క్షత్రియ కులాల్లోని పేదలకు ఎంతో మేలు కలుగుతుందని ప్రభుత్వం చెబుతోంది.

మరోవైపు ఓబీసీ సర్టిఫికెట్ల జారీకి సంబంధించి ఆదాయ పరిమితిని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.గతంలో కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా మెమో జారీ చేసింది. రూ.8 లక్షల లోపు వార్షికాదాయం ఉన్నవారికి ఓబీసీ సర్టిఫికెట్లు జారీచేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

రూ.37.8 కోట్లకు అమ్ముడయిన 1938 నాటి భారతీయ చిత్రకారిణి కళాఖండం

Thu Jul 15 , 2021
విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఓ భారతీయ చిత్రకారిణి గీసిన అద్బుత చిత్రం... ఏకంగా కోట్ల పలికింది. ఎనిమిది దశాబ్దాల కిందట వేసిన ఈ పెయింటింగ్ వేలంలో దాదాపు 38 కోట్లకు అమ్ముడయ్యింది.