ఏపీలో నామినేటెడ్ పదవుల జాతర నేడే.. 50శాతం పదవులు వాళ్లకే

రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల జాబితాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం విడుదల చేయనుంది. ఈ ప్రకటన శుక్రవారమే విడుదల చేయాల్సి ఉన్నా కసరత్తు కొలిక్కి రాకపోవడంతో నేటికి వాయిదా పడింది.

ప్రధానాంశాలు:ఏపీలో నేడు నామినేటెడ్ పోస్టుల జాబితా విడుదల50శాతం పదవులు మహిళలకే ఇచ్చే అవకాశంచాలా కసరత్తు చేశామని చెబుతున్న ప్రభుత్వ పెద్దలుఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్‌ పదవుల జాబితాను ప్రభుత్వం నేడు ప్రకటించనుంది. ఈ జాబితాను శుక్రవారమే ప్రకటించాల్సి ఉన్నా.. కసర్తు కొలిక్కి రాకపోవడంతో నిలిచిపోయింది. హోంమంత్రి మేకతోటి సుచరిత, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణలు కలిసి విజయవాడలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు జాబితా విడుదల చేస్తారని మీడియాకు సమాచారం అందించారు.

కొద్దిసేపటి తర్వాత సాయంత్రం 6 గంటలకు వాయిదా పడినట్లు, తర్వాత సాయంత్రం 7 గంటలకు వాయిదా వేసినట్లు మరోసారి మీడియాకు సమాచారం ఇచ్చారు. చివరికి విలేకరుల సమావేశం రద్దయినట్లు ప్రకటించారు. అయితే నామినేటెడ్ పదవుల జాబితా శనివారం విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

అన్ని వర్గాలకు తగిన న్యాయం చేయాలని, మహిళలకు 50% పదవులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోవడంతో ఎక్కువ కసరత్తు చేయాల్సి వస్తోందని సజ్జల తెలిపారు. పదవుల భర్తీ జాబితా దాదాపు సిద్ధమైందని వాటిల్లో చిన్నచిన్న మార్పులు చేసి శనివారం విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

APPSC: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్... పెరగనున్న గ్రూప్-1, 2 పోస్టులు, 3 నెలల్లోనే భర్తీ

Sat Jul 17 , 2021
రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలు పెరగనున్నాయని ఏపీపీఎస్పీ తెలిపింది. గ్రూప్-1,2 పోస్టులు పెంచాలని ప్రభుత్వాన్ని కోరామని దీనిపై త్వరలోనే నిర్ణయం వచ్చే అవకాశముందని సభ్యుడు షేక్ సలాంబాబు తెలిపారు