Andhra Pradesh: రాష్ట్రంలో 13 మంది ఐపీఎస్‌ల బదిలీ

ఏపీలో 13 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. శ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా రాహుల్‌దేవ్ శర్మ, ఆక్టోపస్ ఎస్పీగా కోయా ప్రవీణ్‌ బదిలీ అయ్యారు.

ప్రధానాంశాలు:ఏపీలో 13 మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీప్రకాశం జిల్లా ఎస్పీగా మాలికా గార్గ్‌రాజమహేంద్రవరం అర్బన్‌ ఎస్పీగా ఐశ్వర్య రస్తోగిరాష్ట్రంలో 13 మంది ఐపీఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు హోంశాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. రాజమహేంద్రవరం అర్బన్‌ ఎస్పీగా ఐశ్వర్య రస్తోగి, జనరల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీగా డా.షీముషి, పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీగా రాహుల్‌ దేవ్‌ శర్మ, డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని నారాయణ్‌ నాయక్‌కు ఆదేశాలు అందాయి. ఆక్టోపస్ ఎస్పీగా కోయా ప్రవీణ్‌ బదిలీ కాగా…. పీటీవోగా కూడా ఆయన అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తించనున్నారు.

ఏపీఎస్పీ విజయనగరం బెటాలియన్‌ కమాండెంట్‌గా విక్రాంత్ పాటిల్‌, కాకినాడ మూడో బెటాలియన్‌ కమాండెంట్‌గా గరుడ్‌ సుమిత్‌ సునీల్‌, విశాఖ డీసీపీ-1గా గౌతమీ శాలి, ఇంటెలిజెన్స్‌ ఎస్పీగా వకుల్‌ జిందాల్‌, మంగళగిరి డీజీపీ కార్యాలయంలో శాంతిభద్రతల ఏఐజీగా ఆర్‌ఎన్‌ అమ్మిరెడ్డి, ప్రకాశం జిల్లా ఎస్పీగా మాలికా గార్గ్‌, విజయవాడ రైల్వే ఎస్పీగా రాహుల్‌దేవ్‌ సింగ్‌, మంగళగిరి ఆరో బెటాలియన్‌ కమాండెంట్‌గా అజితా వేజెండ్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

మూసీ నదికి భారీగా వరద నీరు.. ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత

Wed Jul 14 , 2021
భారీ వర్షాలతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. దీంతో ప్రాజెక్టు గేట్లను ఎత్తివేసిన అధికారులు నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. మూరీ పరివాహక ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటున్నారు.