మహిళలకు జగనన్న మరో వరం… ఏడాదికి 6లక్షల మందికి మేలు

సాధారణ మహిళలను వ్యాపార వేత్తలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలు వ్యాపారం చేసుకునేలా వివిధ సంస్థలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

ప్రధానాంశాలు:మహిళలకు జగన్ ప్రభుత్వం శుభవార్తమహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంఏడాదికి 6లక్షల మందికి మేలుమహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. మహిళలకు శాశ్వత ఉపాధిని అందించేందుకు జగన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాపార అవకాశాల్లో మహిళలకు తోడ్పాడు అందించడం కోసం మరో 14 కార్పోరేట్ సంస్థలు, ఎన్‌జీవోలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనుంది. వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరాపథకాల ద్వారా మహిళలకు నగదు బదిలీ చేసి వ్యాపారాల్లో పెట్టబడికి వినియోగించే అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిద్వారా ఏడాదికి కనీసం 6లక్షల మంది మహిళలకు శాశ్వత జీవనోపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Also Read: వెనక్కి తగ్గని జగన్ సర్కార్.. ఈ నెల 15 నుంచే చెత్తపన్ను!, రుసుముల్లో నో ఛేంజ్

మహిళలు చేతివృత్తుల ద్వారా తయారుచేసే బొమ్మలు, ఇతర వస్తువులు, రెడీమేడ్ దుస్తులను విక్రయించడానికి ఈ-కామర్స్ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనుంది. అంతేకాకుండా ఆధునిక వ్యవసాయ పద్ధతులపై శిక్షణ, వసతుల కల్పన ద్వారా వ్యవసాయ, ఉద్యాన రంగాల్లో లాభదాయకత పెంచడం వంటి చర్యలపైనా జగన్ సర్కార్ ఫోకస్ పెట్టింది.

Also Read: రాష్ట్రమంతా ఒకేలా కర్ఫ్యూ.. మాస్క్ ధరించకపోతే రూ.100 ఫైన్: సీఎం జగన్ ఆదేశాలు

ఈ నేపథ్యంలోనే అజియో బిజినెస్ సంస్థతో ఒప్పందం ద్వారా 90వేల మంది మహిళలకు శాశ్వత ఉపాధి కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు ఎన్ఐ- ఎంఎస్ఎంఈ సంస్థ ద్వారా మహిళలు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు సహకారం అందించనుంది. ఈ సంస్థ ద్వారా సుమారు 1300 మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారుచేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

భారత్ జట్టుకి జరిమానా.. చేసిన తప్పిదం ఏంటంటే..?

Tue Jul 13 , 2021
ఇంగ్లాండ్‌తో రెండో టీ20 ఉత్కంఠగా ముగిసింది. దాంతో.. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ బౌలింగ్ మార్పులతో పాటు ఫీల్డింగ్ కూర్పు కోసం ఎక్కువగా చర్చలు జరుపుతూ కనిపించింది.