అమెజాన్ శుభవార్త.. క్రెడిట్ కార్డు లేని వారి కోసం కొత్త సేవలు?

అమెజాన్ కస్టమర్ల కోసం కొత్త సేవలు అందుబాటులోకి తీసుకువస్తోంది. క్రెడిట్ కార్డు లేకపోయినా కూడా బై నౌ పే లేటర్ సేవలు అందుబాటులోకి తీసుకురానుంది. దీని కోసం ఇతర సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటోంది.

ప్రధానాంశాలు:అమెజాన్ కొత్త సేవలుక్రెడిట్ కార్డు లేకున్నా పర్లేదుఆ సర్వీసులు పొందొచ్చుదిగ్గజ ఈకామర్స్ సంస్థ అమెజాన్ తన కస్టమర్లకు తీపికబురు అందించేందుకు రెడీ అవుతోంది. క్రెడిట్ కార్డు లేని వారికి కూడా బై నౌ పే లేటర్ సర్వీసులు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. దీని కోసం ఇతర సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటోంది.

అఫిర్మ్ హోల్డింగ్స్ కంపెనీ ఈ విషయాన్ని వెల్లడించింది. ఫ్లెక్సిబుల్ పేమెంట్ సర్వీస్ త్వరలోనే అమెజాన్‌లో అందుబాటులో ఉంటాయని ఈ కంపెనీ తెలియజేసింది. ఇరు సంస్థలు ఇప్పటికే ఈ సర్వీసుల ట్రయల్స్‌ను ప్రారంభించాయి. ఎంపిక చేసిన కస్టమర్లకు ఈ సేవలు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ సేవలు తొలిగా అమెరికాలో అందుబాటులోకి రాబోతున్నాయి. ఇకపోతే అమెజాన్ బై నౌ పే లేటర్ సర్వీసుల ద్వారా కస్టమర్లు ఇప్పుడు నచ్చిన ప్రొడక్టును కొనుగోలు చేసి, ఈ డబ్బులను నిర్ణీయ గడువులోగా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ సమయంలోగా డబ్బులు కట్టకపోతే వడ్డీ పడుతుంది.

Also Read: ఈ బ్యాంక్‌లో డబ్బులు దాచుకునే వారికి షాక్!

Also Read: కేంద్రం గుడ్ న్యూస్.. ఈ కార్డుతో రూ.2 లక్షల బెనిఫిట్.. ఉచితంగానే పొందండిలా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది: వైసీపీ ఎంపీ షాకింగ్ కామెంట్స్

Sat Aug 28 , 2021
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అదరగొట్టేస్తాడట.. దిమ్మతిరిగి బొమ్మ కనిపిస్తుంది. హాస్యం చేయాలనుకుని అపహాస్యం పాలవుతున్నావ్ ఈ జబర్దస్త్ కామెడీలాపి అంటూ ట్వీట్.