‘ఏపీ రాజధాని విశాఖ’.. యాంకర్ ప్రదీప్ వ్యాఖ్యలపై దుమారం, సీరియస్ వార్నింగ్

యాంకర్ ప్రదీప్ మళ్లీ వివాదంలో చిక్కుకున్నాడు. ఏపీ రాజధాని విశాఖ అంటూ ఓ షోలో ఆయన చేసిన కామెంట్‌పై అమరావతి పరిరక్షణ సమితి తీవ్ర అభ్యంతరం చెబుతోంది.

ప్రధానాంశాలు:మరో వివాదంలో యాంకర్ ప్రదీప్ఏపీ రాజధాని విశాఖ అంటూ కామెంట్మండిపడుతున్న అమరావతి పరిరక్షణ సమితితెలుగు టాప్ యాంకర్ ప్రదీప్‌కు వివాదాలు కొత్తేమీ కాదు. అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ చిక్కుల్లో పడుతుంటాడు. ఇలాగే ప్రదీప్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తాజాగా ఓ షోలో పాల్గొన్న ప్రదీప్.. ఏపీ రాజధాని విశాఖ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై అమరావతి పరిరక్షణ సమితి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులో ఉన్న అంశాలపై యాంకర్ ప్రదీప్‌ ఎలా మాట్లాడతారని… తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంభహరించుకుని ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ కొలికలపూడి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.

ప్రదీప్ క్షమాపణ చెప్పకుంటే హైదరాబాద్‌లోని ఆయన ఇంటిని ముట్టడిస్తామని అమరావతి పరిరక్షణ సమితి హెచ్చరికలు జారీచేసింది. రైతులు, ప్రజల మనోభావాలు కించపర్చేలా ఎవరు వ్యవహరించినా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఇటీవల హైపర్ ఆదికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైన సంగతి తెలిసిందే.

ఓ ఛానల్‌లో ప్రసారమమైన ప్రోగ్రామ్‌ ‘బతుకమ్మ’ను అవమానించేలా వ్యవహరించారంటూ పలు తెలంగాణ సంఘాలు మండిపడ్డారు. ఆయనపై ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హైపర్ ఆది తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చివరికి ఆది సోషల్‌మీడియా వేదికగా క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఇప్పుడు అదే బాటలో యాంకర్ ప్రదీప్ వివాదంలో చిక్కుకోవడం హాట్‌టాపిక్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

లక్షద్వీప్‌పై మరో వివాదస్పద ప్రతిపాదన.. కేరళ నుంచి కర్ణాటకకు న్యాయపరిధి!

Mon Jun 21 , 2021
లక్షద్వీప్ భౌతిక స్వరూపాన్ని, వాతావరణాన్ని పూర్తిగా తలకిందులు చేసే విధంగా అక్కడ పాలనా యంత్రాంగం నిర్ణయాలు ఉండడంతో పాటు ఏకపక్ష విధానంగా కొనసాగుతోందని మేధావులు ఆరోపిస్తున్నారు.