చీరకట్టు.. లంగా జాకెట్టు ధరించి.. అభిమాలనకు కనువిందు కలిగిస్తున్న బన్నీ భార్య, కూతురు

ఇటీవలే స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్‌గా ప్రమోషన్ పొంది తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అయ్యారు అల్లు అర్జున్. సినిమాల ద్వారా బన్నీ వినోదాన్ని పంచుతుంటే.. ఆయన భార్య స్నేహా.. సోషల్‌మీడియా ద్వారా ఫ్యాన్స్‌ని అలరిస్తుంటారు. తాజాగా ఆమె ఓ ఆసక్తికర వీడియోని షేర్ చేశారు.

తొలి సినిమా ‘గంగోత్రి’తోనే తను ఎంత గొప్ప నటుడో అనే విషయాన్ని నిరూపించుకున్నారు అల్లు అర్జున్. అల్లు రామలింగయ్య నట వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన.. తన మామ.. మెగాస్టార్ చిరంజీవిని కూడా తన నటనలో ప్రతిబింబిస్తూ.. ప్రతీ సినిమాలోనూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలోనే మొట్టమొదలుగా సిక్స్ ప్యాక్ బాడీ చేసిన స్టార్‌గా ఆయన గుర్తింపు సాధించారు. ఇంతకాలంగా స్టైలిష్‌ స్టార్‌గా ఉన్న ఆయన తన రీసెంట్ చిత్రం ‘పుష్ప’తో ‘ఐకాన్‌ స్టార్’గా కొత్త బిరుదు పొందారు.

ఇక సోషల్‌మీడియా విషయానికొస్తే.. అల్లు అర్జున్ అంతగా యాక్టివ్‌గా ఉండరు. సినిమాలకు సంబంధించి ఏదైనా అప్‌డేట్ వస్తే తప్ప ఆయన నెటిజన్లను పలకరించరు. కానీ, ఆయన సతీమణి స్నేహా మాత్రం సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తరచూ బిన్నీ, వాళ్ల పిల్లలకు సంబంధించిన విషయాలను ఆమె నెటిజన్లతో పంచుకుంటూ ఉంటారు. అంతేకాదు.. సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో ఉండే అంశాలు, రకరకాల స్టైల్ వీడియోలు కూడా చేస్తూ.. ఆమె ఫ్యాన్స్‌కి కావాల్సినంత వినోదాన్ని పంచుతుంటారు. తాజాగా ఆమె ఓ ఆసక్తికర వీడియోని షేర్ చేశారు.

కరోనా కారణంగా లాక్‌డౌన్ అమలులోకి రావడంతో ప్రతీ రోజు సోషల్‌మీడియాలో కొత్త ట్రెండ్లు అందుబాటులోకి వచ్చాయి. అందులో ట్రెడిషనల్ వేర్ ట్రెండ్ కూడా ఉంది. దాంతో పాటు.. లేటెస్ట్‌గా ‘మేక్ పీపుల్ థింక్ ఇట్స్ ఏ పిక్చర్’ అంటూ కొత్త ట్రెండ్ అందుబాటులోకి వచ్చింది. దీనిపై అల్లు స్నేహా, ఆమె కూతురు అర్హ.. రీల్ చేసి.. దాన్ని పోస్ట్ చేశారు. ఇందులో స్నేహా చీరలో, అర్హ లంగా జాకెట్ ధరించి వీక్షకులకు కనువిందు కలిగించారు. ఇది చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇద్దరు ఎంతో క్యూట్‌గా ఉన్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు.
View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఈ శాంసంగ్ ఫోన్ ధర మళ్లీ పెరిగింది.. అయినా రూ.8 వేలలోపే!

Tue Jul 13 , 2021
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన బడ్జెట్ ఫోన్ గెలాక్సీ ఎం02 ధరను మనదేశంలో పెంచింది. దీంతో ఇప్పుడు ఈ ఫోన్ ధర మనదేశంలో రూ.7,999 నుంచి ప్రారంభం కానుంది.