Krunal Pandyaతో గొడవ.. దీపక్ హుడా సాహసోపేత నిర్ణయం

మ్యాచ్ గమనానికి అనుగుణంగా గేర్లు మార్చడంలో దీపక్ హుడాకి తిరుగులేదు. ఐపీఎల్ 2021 సీజన్‌లో పంజాబ్‌ టీమ్‌కి ఊహించని స్కోర్లు అందించిన దీపక్ హుడా.. దేశవాళీ క్రికెట్‌లో టీమ్ మారబోతున్నాడు.

ప్రధానాంశాలు:బరోడా టీమ్‌కి గుడ్ బై చెప్పేసిన దీపక్ హుడారాజస్థాన్ టీమ్‌కి ఆడేందుకు నిరభ్యంతర పత్రం తీసుకున్న హుడాఐపీఎల్ 2021 సీజన్‌లో పంజాబ్ టీమ్‌కి ఆడిన దీపక్ హుడా కృనాల్ పాండ్యాతో గొడవ కారణంగానే బరోడా టీమ్‌కి దూరంభారత మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ దీపక్ హుడా కెరీర్‌పరంగా సాహసోపేత నిర్ణయం తీసుకున్నాడు. సుదీర్ఘకాలంగా దేశవాళీ క్రికెట్‌లో బరోడా టీమ్‌కి ఆడుతున్న దీపక్ హుడా.. ఈ ఏడాది జనవరిలో బరోడా టీమ్ కెప్టెన్ కృనాల్ పాండ్యాతో గొడవపడిన విషయం తెలిసిందే. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ముంగిట కృనాల్‌తో గొడవ కారణంగా టీమ్ బయో- సెక్యూర్ బబుల్ నుంచి బయటికి వెళ్లిపోయిన దీపక్ హుడా.. బరోడా క్రికెట్ అసోషియేషన్ (బీసీఏ) పెద్దలకి కోపం తెప్పించాడు. దాంతో.. అప్పట్లో అతనిపై నిషేధం కూడా పడింది.

ఐపీఎల్ 2021 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కి ఆడిన దీపక్ హుడా 143.20 స్ట్రైక్‌రేట్‌తో 116 పరుగులు చేశాడు. ఇందులో రెండు గెలిపించే ఇన్నింగ్స్‌లు కూడా ఉండగా.. మిడిలార్డర్‌లో నమ్మదగిన బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు పొందాడు. ఇక ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లు యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి ప్రారంభంకానుండగా.. దేశవాళీ క్రికెట్‌లో బరోడా తరఫున ఆడకూడదని దీపక్ హుడా తాజాగా నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు బరోడా క్రికెట్ అసోషియేషన్ నుంచి నిరభ్యంతర పత్రం కూడా తీసుకున్న దీపక్ హుడా.. రాజస్థాన్ తరఫున ఆడాలని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.

2013 నుంచి బరోడా టీమ్‌కి ఆడుతున్న దీపక్ హుడా.. ఇప్పటి వరకూ 46 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లాడి 2908 పరుగులు చేశాడు. అలానే 68 లిస్ట్-ఎ గేమ్స్, 131 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 2017లో భారత్ జట్టులోకి ఎంపికైనా.. తుది జట్టులో మాత్రం దీపక్ హుడాకి ఛాన్స్ దక్కలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

బీజేపీ నేత వాహనం అడ్డగింత.. 100 మంది రైతులపై దేశద్రోహం కేసు!

Thu Jul 15 , 2021
రాజద్రోహం చట్టం కింద కేసులు నమోదుచేయడాన్ని సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించిన రోజే దీనికి సంబంధించి మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.