అఫ్గన్‌లో అల్-ఖైదా ఉనికి.. వచ్చే ఏడాది అమెరికాపై దాడికి వ్యూహం: CIA సంచలన నివేదిక

అల్-ఖైదా ఉగ్రవాదులు అమెరికాలోని ట్విన్ టవర్స్‌పై దాడికి పాల్పడి 20 ఏళ్లు పూర్తయ్యింది. ఈ దాడి తర్వాత అఫ్గనిస్థాన్ గడ్డపై యుద్ధం ప్రకటించిన అమెరికా.. ఇటీవలే ముగించింది.

ప్రధానాంశాలు:అమెరికాకు పొంచి ఉన్న అల్-ఖైదా ముప్పు.అఫ్గన్ భూభాగంలో బలపడే ప్రయత్నాలు.సీఐఏ నివేదికలో సంచలన విషయాలు. అఫ్గనిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకోవడంతో ఉగ్రమూకలకు మరోసారి స్వర్గంగా మారుతుందని అంతర్జాతీయ సమాజం ఆందోళన చెందుతోంది. అక్కడ జరుగుతున్న పరిణామాలు ఈ ఆందోళనలు, అనుమానాలకు బలం చేకూర్చుతున్నాయి. తాజాగా, అల్-ఖైదా ఉగ్రవాద సంస్థ అఫ్గన్ భూభాగం నుంచి బలపడేందుకు ప్రయత్నాలు చేస్తోందని అమెరికా నిఘా వర్గాలు పేర్కొన్నాయి. తాలిబన్లు స్వాధీనం చేసుకున్న అఫ్గన్‌లో అల్-ఖైదా పుంజుకుంటున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయని సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) బుధవారం వెల్లడించింది.

Intelnews.org ప్రచురించిన కథనంలో సీఐఏ డిప్యూటీ డైరెక్టర్ డేవిడ్ కొహెన్ ప్రకారం.. ‘అఫ్గన్‌లో అల్-ఖైదా కార్యకలాపాలు ప్రారంభానికి ప్రయత్నాలు మొదలైనట్టు ప్రస్తుత నిఘా వర్గాల నివేదికలు వెల్లడిస్తున్నాయి’. ఏదిఏమైనా ముఖ్యంగా ఈ విషయంలో సీఐఏ దృష్టిసారించిందని, తగిన కార్యాచరణ ప్రారంభించిందని ఆయన తెలిపారు. పరిస్థితిని అమెరికా నిఘా వర్గాలు నిశితంగా గమనిస్తున్నాయని కొహెన్ వివరించారు.

రాజధాని వాషింగ్టన్ డీసీలో జరిగిన నిఘా, జాతీయ భద్రత సమావేశంలో కొహెన్ మాట్లాడుతూ.. కాబూల్‌లోని అమెరికా రాయబార కార్యాలయం మూసివేయడం, అలాగే అఫ్గనిస్థాన్ వ్యాప్తంగా సీఐఏ స్టేషన్ల నెట్‌వర్క్ మూసివేయడం వల్ల అక్కడ పరిస్థితులను అంచనా వేయడానికి అమెరికా నిఘా ఏజెన్సీల సామర్థ్యం"తగ్గిపోయిందని అంగీకరించారు.

ఇటీవలి వారాలలో అఫ్గనిస్థాన్ సరిహద్దులో ఉన్న దేశాల నుంచి సమాచారం సేకరణ జరుగుతోందన్నారు. ప్రస్తుతానికి అమెరికా నిఘా వ్యవస్థ అంచనా ప్రకారం.. అల్- ఖైదా తన మునుపటి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఒకటి నుంచి రెండేళ్ల సమయం పడుతుంది.. తద్వారా అమెరికా ప్రయోజనాలను నేరుగా బెదిరించవచ్చు. గతంలో అఫ్గన్ భూభాగం నుంచే అమెరికాపై ఒసామా బిన్ లాడెన్ నాయకత్వంలోని అల్-ఖైదా ఉగ్రవాదులు దాడికి పాల్పడటమే ఆందోళనకు ప్రధాన కారణం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

గోధుమపిండిలో ఈ పొడిని కలిపి తింటే షుగర్ తగ్గుతుందట..

Thu Sep 16 , 2021
తాజాగా ఒక స్టడీ చేశారు. ఆ స్టడీ ప్రకారం పనస బాగా ఉపయోగపడుతుందని తేలింది. అయితే మరి ఈ రీసెర్చ్ ఎందుకు..? , ఆ స్టడీ గురించి ఎటువంటి ఫలితాలు పొందవచ్చు అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. తాజాగా చేసిన స్టడీ ప్రకారం షుగర్ లెవల్స్ ను తగ్గించడంలో పనస పండ్లు ఎలా ఉపయోగపడతాయి అనేది రీసెర్చ్ చేశారు.