పలు ప్రాంతాల్లో ఆత్మాహుతి దాడులకు అల్‌ఖైదా కుట్ర.. భగ్నం చేసిన యూపీ పోలీసులు

దర్బాంగ పేలుడు కేసులో యూపీకి చెందిన ఇద్దర్ని హైదరాబాద్‌లో ఎన్ఐఏ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రెండు రోజుల్లో మరో ఇద్దర్ని యూపీలో అరెస్ట్ చేశారు.

ప్రధానాంశాలు:దేశంలో దాడులకు ఉగ్రవాదుల కుట్రలు.అల్‌ఖైదా ప్లాన్‌ను భగ్నం చేసిన ఏటీఎస్.యూపీలో ఇద్దరు అనుమానితులు అరెస్ట్ రాజధాని లక్నో సహా ఉత్తర్ ప్రదేశ్ వ్యాప్తంగా ఆత్మాహుతి దాడులు సహా పలుచోట్ల బాంబు పేలుళ్లకు అల్ ఖైదా ఉగ్రవాదులు వ్యూహరచన చేసినట్టు పోలీసులు తెలిపారు. అల్‌ఖైదా‌ మద్దతు సంస్థ ‘అనార్ ఘజవత్ ఉల్ హింద్’‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను ఆదివారం అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు. లక్నో జిల్లాకు చెందిన మినహాజ్ అహ్మద్, మసీరుద్దీన్‌ను ఏటీఎస్ అధికారులు అరెస్ట్ చేశారని సీనియర్ పోలీస్ అధికారి ప్రశాంత్ కుమార్ వెల్లడించారు.

‘యూపీ ఉగ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్) అతిపెద్ద ఉగ్రవాద కుట్రను భగ్నం చేసింది.. అల్‌ఖైదాకు చెందిన అన్సార్ ఘాజవత్ ఉల్ హింద్‌తో సంబంధం ఉన్న ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది.. సోదాల్లో ఆయుధాలు, పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి’ అని ఎస్పీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. ‘ఆగస్టు 15లోపు రాష్ట్రంలోని లక్నో సహా వివిధ పట్టణాలు, నగరాలలోని ముఖ్యమైన ప్రదేశాలు, స్మారకాలు, రద్దీ ప్రాంతాలలో పేలుళ్లు, ఆత్మాహుతి దాడులకు కుట్ర పన్నారు.. అందుకు ఆయుధాలు.. పేలుడు పదార్థాలను సిద్ధం చేసుకున్నారు’ అని అన్నారు.

పాకిస్థాన్‌-అఫ్గనిస్థాన్ సరిహద్దుల్లోని పెషావర్, క్వెట్టా నుంచి అల్‌ఖైదా ఉగ్రవాది ఉమర్ హల్మండి సహకారంతో ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగిస్తున్నారని తెలిపారు. అరెస్టయిన నిందితుడు మిన్‌హాజ్ అహ్మద్ కాకోరి నివాసంలో పిస్టర్, పేలుడు పదార్థాలను గుర్తించారని పేర్కొన్నారు. జాన్‌పూర్ జిల్లాలోని మరిహౌ పట్టణంలోని మసీరుద్దీన్ నివాసంలో కుక్కర్ బాంబు, పేలుడు పదార్థాలు సోదాల్లో బయటపడ్డాయని అన్నారు. ఇరువురిని సోమవారం కోర్టులో ప్రవేశపెట్టి, కస్టడీకి కోరనున్నట్టు అధికారులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

Suriya : హిందిలోకి ‘సూరారై పొట్రు’.. మళ్లీ మ్యాజిక్ క్రియేట్ చేయనున్న టీం!

Mon Jul 12 , 2021
సూర్య నటించిన సూరారై పొట్రూ (తెలుగులో ఆకాశం నీ హద్దురా) ఇప్పుడు హిందిలోకి వెళ్తోంది. ఈ మేరకు తాజాగా అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ చిత్రం గత ఏడాది అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది.