మీకు డ్యాన్స్, పాడటం రాకపోయినా సరే.. అవి చేస్తే నేను స్టోరీలో పెడతాను: అక్షయ్

బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్‌కి దేశవ్యాప్తంగా ఏ రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. యాక్షన్ హీరోగా బాలీవుడ్‌లో ఆయన ప్రత్యేకంగా గుర్తింపు సంపాదించుకున్నారు. తాజాగా ఆయన ‘ఫిలాల్‌-2’ అనే వీడియో సాంగ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

సోషల్‌మీడియా వాడకం పెరిగినప్పటి నుంచి సినీ తారలు, అభిమానుల మధ్య ఉన్న దూరం తగ్గుతూ వచ్చింది. తమ అభిమాన నటుల గురించి సమాచారం తెలుసుకోవడం అభిమానులకు సులభంగా మారింది. అంతేకాక.. ఫ్యాన్స్‌తో నటీనటులు తరచూ సంభాషించడం కూడా సహజంగా మారింది. ఇక సెలబ్రిటీలు తమ సినిమాల ప్రమోషన్‌ కూడా ఈ సోషల్‌మీడియానే ఎక్కువ వాడుతున్నారు. ప్రమోషన్ల కోసం.. ప్రేక్షకులను ఆకట్టుకొనేందుకూ ఇక్కడ వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు.

తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా ఇదే విధంగా ప్రయోగం చేశారు. అక్షయ్ కుమార్‌కు దేశవ్యాప్తంగా ఏ రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. రొటీన్ సినిమాల్లా కాకుండా.. కొన్ని యాక్షన్, కొన్ని కామెడీ చిత్రాలు చేస్తూ.. ఆయన ఎన్నో సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ఆయన సినిమా వచ్చిందంటే చాలా మినిమమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందని ఫ్యాన్స్ ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు. సినిమాలతో పాటు ఆయన కొన్ని వీడియో సాంగ్స్ కూడా చేస్తుంటారు. తాజాగా ఆయన ‘ఫిలాల్-2’ అనే పాటతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ పాటలో ప్రముఖ హీరోయిన్ కృతి సనన్ సోదరి.. నుపూర్ సనన్ అక్షయ్ సరసన నటించింది. రెండు సంవత్సరాల క్రితం వచ్చిన ‘ఫిలాల్’ అనే పాటకు దీన్ని సీక్వెల్‌గా రూపొందించారు. దీనికి బీ ప్రాక్ సంగీతం, గాత్రం అందించగా.. అర్వింద్ర్ ఖైరా దర్శకత్వం వహించారు. ఈ నెల 6వ తేదీన విడుదలైన ఈ పాట.. ప్రస్తుతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అయితే ఈ పాటని ప్రమోట్ చేయడానికి అక్షయ్ ఓ ప్రయోగానికి పూనుకున్నారు.

తన పాటను ఇంత ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఆయన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. ఈ పాటకి తమదైన స్టైల్‌లో రీల్స్ చేయాలంటూ ఆయన తన ఫాలోవర్లను కోరారు. ‘‘మీరు డ్యాన్సర్లు, సింగర్లు కాకపోయినా ఫర్వాలేదు.. మా పాట (ఫిలాల్-2)కి రీల్స్ చేయండి. అందులో ఉన్న అత్యుత్తమైన వాటిని నేను నా స్టోరీలో పోస్ట్ చేస్తాను’’ అని ఆయన పేర్కొన్నారు. తమ క్రియేటివిటీకి పదునుపెట్టాలి అంటూ ఆయన ఫ్యాన్స్‌ని కోరారు. మరి అక్షయ్ కోరిక మేరకు ఆయన పాటకి ఫ్యాన్స్ ఎలాంటి రీల్స్ చేస్తారో.. వాటిలో అక్షయ్ దేన్ని మెచ్చుకుంటారో వేచి చూడాల్సిందే.
View this post on Instagram A post shared by Akshay Kumar (@akshaykumar)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ప్రైవసీ పాలసీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం.. వాట్సాప్ సంచలన ప్రకటన!

Fri Jul 9 , 2021
భారతీయ చట్టాలకు అనుగుణంగా వ్యక్తిగత గోప్యత పరిరక్షణకు కట్టుబడి ఉంటామని కేంద్ర ప్రభుత్వానికి వాట్సాప్‌ ఇటీవల స్పష్టం చేసిన విషయం తెలిసిందే.