లైన్ లోకి బంగార్రాజు.. సందేహాలకు చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన అక్కినేని నాగార్జున

అక్కినేని నాగార్జున- కళ్యాణ్ కృష్ణ కురసాల కాంబోలో రాబోతున్న 'బంగార్రాజు' రెగ్యులర్ షూటింగ్‌కి సంబంధించి ఓ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాను జూలై రెండవ వారంలో సెట్స్ మీదకు తెస్తున్నారట.

ప్రధానాంశాలు:'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాకు సీక్వల్‌బంగార్రాజు పేరుతో న్యూ మూవీ రొమాంటిక్ రోల్‌లో నాగార్జునఇటీవలే 'వైల్డ్ డాగ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన అక్కినేని నాగార్జున ఈ సారి రొమాంటిక్ రోల్‌లో కనిపించబోతున్నారు. నాగార్జున సూపర్ హిట్ మూవీ 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాకు సీక్వల్‌గా 'బంగార్రాజు' మూవీ రాబోతోందని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. కానీ ఈ మూవీ సెట్స్ మీదకు మాత్రం రాలేదు. దీంతో ఈ సినిమాపై జనాల్లో అనుమానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు నాగార్జున.

గతంలో వచ్చిన 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాలో నాగార్జున పోషించిన 'బంగార్రాజు' పాత్రకు, ఆ పాత్ర లుక్‌కు భారీ ఆదరణ లభించింది. దాంతో ఆ పాత్ర పేరుతో అదే లుక్‌తో గ్రామీణ నేపథ్యంలోనే మరో సినిమా చేయాలని భావించిన నాగార్జున.. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో 'బంగార్రాజు' పేరుతో సినిమా చేసేందుకు రెడీ అయ్యారు.

చాలా రోజుల పాటు ఈ మూవీ స్క్రిప్ట్ పనులపై కసరత్తులు చేసిన డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురసాల ఇటీవలే ఆ పని ఫినిష్ చేశారట. ఈ కథ విని నాగార్జున కూడా ఓకే అన్న తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఈ నేపథ్యంలో జూలై రెండవ వారం నుంచి బంగార్రాజు మూవీ సెట్స్ పైకి రాబోతోందని ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో నాగార్జున వెల్లడించడం అక్కినేని అభిమానులను ఖుషీ చేసింది.
పదో తరగతిలోనే ప్రేమ లేఖలు.. వంతులు పెట్టుకొని మరీ వెళ్లేవాళ్లం.. ఇవీ చిరంజీవి సీక్రెట్స్
ఈ చిత్రంలో నాగార్జున జోడీగా రమ్యకృష్ణ జోడీ నటించనుంది. ఇందులో నాగ్ తనయుడు నాగచైతన్య కూడా భాగం కానున్నాడని తెలుస్తోంది. అతిత్వరలో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

మళ్లీ తెరుచుకోనున్న స్టెరిలైట్ ప్లాంట్.. తమిళనాడు సంచలన నిర్ణయం

Mon Apr 26 , 2021
రాష్ట్రంలో ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు తమిళనాడు ప్రభుత్వం తూత్తుకుడిలోని స్టెరిలైట్ స్టీల్ ప్లాంట్‌ను తెరవనుంది. అక్కడ నాలుగు నెలల పాటు ఆక్సిజన్ ఉత్పత్తి చేపట్టనుంది.