కాబూల్‌: ఉక్రెయిన్ విమానం దొంగిలించి.. ఇరాన్‌కు ఎత్తుకెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు!

అఫ్గనిస్థాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో పలు దేశాలు అక్కడ చిక్కుకున్న తమ పౌరులను సురక్షితంగా తరలించేందుకు ప్రత్యేక విమానాలను నడుపుతున్నాయి.

ప్రధానాంశాలు:ఆదివారం ఉక్రెయిన్ నుంచి కాబూల్‌కు విమానం.హైజాాక్ చేసినట్టు ఉక్రెయిన్ మంత్రి వెల్లడి.మహసద్‌లో ఇందనం నింపుకెళ్లినట్టు ఇరాన్ ప్రకటన.అఫ్గనిస్థాన్‌లో చిక్కకున్నవారిని తరలిస్తున్న ఉక్రెయిన్ విమానం హైజాక్‌కు గురయ్యింది. హైజాక్ చేసిన విమానాన్ని ఇరాన్‌కు తరలించినట్టు ఉక్రెయిన్ మంత్రి స్వయంగా వెల్లడించారని అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఉక్రెయిన్ పౌరులను తరలించడానికి ఈ విమానం కాబూల్‌కు గతవారం వచ్చినట్టు పేర్కొంది. ఉక్రెయిన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి యోవజెనే యెనిన్ రష్యా న్యూస్ ఏజెన్సీ టాస్‌‌తో మాట్లాడుతూ.. తమ విమానం హైజాక్ గురయ్యిందని, ఉక్రెయిన్‌లను బదులు ఇతరులతో ఇరాన్ వెళ్లిందన్నారు.

‘గత ఆదివారం మా విమానం హైజాక్‌కు గురయ్యింది. మంగళవారం ఆ విమానాన్ని మా నుంచి దొంగలించి ఇరాన్‌ తీసుకెళ్లారు. అపహరణకు గురైన మా విమానం ఉక్రెనియన్లకు బదులు గుర్తు తెలియని ప్రయాణీకుల బృందంతో ఇరాన్‌కు వెళ్లింది.. మా దేశ పౌరులు కాబూల్ విమానాశ్రయానికి రాకపోవడంతో తరలింపునకు చేసిన మూడు ప్రయత్నాలు విజయవంతం కాలేదు’ అని మంత్రి తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆయుధాలతో వచ్చి ఈ విమానాన్ని కాబుల్‌ ఎయిర్‌పోర్టు నుంచి ఇరాన్‌ తీసుకెళ్లినట్లు ఉక్రెయిన్‌ డిప్యూటీ విదేశాంగ మంత్రి యెవ్‌జెనీ యెనిన్‌ పేర్కొన్నారు.

అయితే, విమానం తాము హైజాక్ చేయలేదని, మహసద్‌లో ఇంధనం నింపుకుని అది కీవ్‌కు వెళ్లిపోయిందని ఇరాన్ సివిల్ ఏవియోషన్ విభాగం పేర్కొంది. మరోవైపు, అఫ్గన్‌ను తాలిబానిస్థాన్‌ కానీయమని అధ్యక్షుడిగా ప్రకటించుకున్న అమ్రుల్లా సలేహ్‌ స్పష్టం చేశారు. తాలిబన్లతో చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు.

అదే సమయంలో ఆ ఉగ్రమూకను తీవ్రంగా ప్రతిఘటిస్తున్నట్లు కూడా వెల్లడించారు ‘‘మేము వ్యక్తిగత పదవులు అడగటంలేదు.. వ్యక్తిగత పనులు చేయాలని చెప్పడంలేదు.. అఫ్గన్‌ ప్రజలకు వారి దేశం ఎలా ఉండాలో ఎంచుకొనే హక్కు ఉంది. అఫ్గన్‌ ప్రజలు వ్యక్తిగత గుర్తింపు కోల్పోవడం మాకు ఏ మాత్రం ఇష్టం లేదు’’ అని ఆయన పునరుద్ఘాటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఇలా సంతోషంగా ఉండనివ్వండి.. పొలిటికల్‌ ఎంట్రీపై సోనూసూద్‌ స్పందన

Tue Aug 24 , 2021
కోవిడ్ -19 మహమ్మారి కారణంగా కష్టపడుతున్నవారి కోసం నటుడు సోనుసూద్ అవిశ్రాంతంగా మరియు నిస్వార్థంగా పనిచేస్తున్నారు. ఈ మధ్యకాలంలో వచ్చిన సెకండ్ వేవ్ సమయంలో కూడా ఆయన లక్షలాది మందికి సహాయం చేశారు.