ఈటల‌కు కొత్త తలనొప్పులు, ఆ వ్యవహారం కేంద్రం వద్దకు.. అంతా ఈయన వల్లే.. ఏమంటున్నారో చూడండి

Jamuna Hatcheries: ఈటల రాజేందర్ కుటుంబం ప్రభుత్వ దేవాదాయ భూములను తనఖా పెట్టి కెనరా బ్యాంక్ నుండి భారీ ఎత్తున రుణాలు పొందారని అడ్వకేట్ రామారావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ప్రధానాంశాలు:ఈటలపై కేంద్రానికి న్యాయవాది ఫిర్యాదుఅక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణతీవ్ర ఆర్థిక నేర పరిశోధన సంస్థతో విచారణకు డిమాండ్Devaryamjal Land Issue: మాజీ మంత్రి ఈటల రజేందర్ సహా ఆయన కుటుంబంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖకు ఫిర్యాదు అందింది. ఈటల రాజేందర్ భార్య జమున, కుమారుడు ఈటల నితిన్, కుమార్తె క్షమితపై న్యాయవాది రామారావు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు, తీవ్ర ఆర్థిక నేరాల పరిశోధన సంస్థకు ఫిర్యాదు చేశారు. ఈటల రాజేందర్ కుటుంబం ప్రభుత్వ దేవాదాయ భూములను తనఖా పెట్టి కెనరా బ్యాంక్ నుండి భారీ ఎత్తున రుణాలు పొందారని అడ్వకేట్ రామారావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సర్వే నంబర్ 56, 57 58, దేవరయాంజల్‌లో ఉన్న సీతారామచంద్ర స్వామి భూముల అక్రమ రిజిస్ట్రేషన్, ఈటల జమున పేరున పెద్ద ఎత్తున బ్యాంక్ రుణాలు తీసుకున్నట్లుగా ఫిర్యాదులో తెలిపారు.

తీవ్ర ఆర్థిక నేర పరిశోధన సంస్థతో ఈ వ్యవహారాన్ని విచారణ చేయించాలని హైకోర్టు న్యాయవాది ఇమ్మనేని రామారావు తన ఫిర్యాదులో కోరారు. ఆయన మాట్లాడుతూ.. నిషేధిత జాబితాలో ఉన్న భూములతో తన సంస్థ అయిన జమునా హేచరీస్‌కు లబ్ధి చేకూరేలా కెనరా బ్యాంకు ద్వారా రూ.28 కోట్ల రుణం పొందారని తెలిపారు. 2014లో శ్రీసీతారామ స్వామి దేవస్థానం హైకోర్టులో ఓ వ్యాజ్యం దాఖలు చేసిందని గుర్తు చేశారు. దీనిపై హైకోర్టు కూడా కీలక ఆదేశాలు ఇచ్చిందని వెల్లడించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వాటిని నిషేధిత జాబితాలో చేర్చిందని గుర్తు చేశారు.

2017లో ఈటల రాజేందర్ తన అధికారాన్ని ఉపయోగించుకొని సర్వే నంబర్ 56, 57, 58లో ఉన్న భూములను ఈటల జమున పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. 2020లో ఈ భూములను తనఖా పెట్టి రుణం పొందారని న్యాయవాది విమర్శించారు. అందుకే ఈ వ్యవహారంలో కేంద్రానికి ఫిర్యాదు చేశామని తెలిపారు. ఆ భూములను శ్రీరాముడి దేవాలయానికి చేరే వరకూ పోరాడతామని వెల్లడించారు.

వీడియో: ఈటలకు కొత్త తలనొప్పులు.. ఈయన వల్లే.. ఏమంటున్నారో చూడండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత.. ప్రధాని మోదీ సంతాపం

Thu Jun 10 , 2021
ప్రముఖ బెంగాలీ చిత్ర నిర్మాత, రచయిత బుద్ధదేవ్‌ దాస్‌గుప్తా (77) కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం మరణించారు.