వర్కవుట్స్ చేసేది అందుకోసమే.. సన్నగా కావడం కాదు మ్యాటర్! అసలు సీక్రెట్ చెప్పేసిన ప్రగతి

నిత్యం వర్కవుట్స్ చేస్తూ సోషల్ మీడియాను హీటెక్కించే ప్రగతి.. తాజాగా ఆ వర్కవుట్స్ ఎందుకు అనే దానిపై రియాక్ట్ అయింది. వర్కవుట్స్ అనేవి కేవలం సన్నబడటం కోసం కాదని చెప్పింది.

సోషల్ మీడియాలో సీనియర్ నటి ప్రగతి చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డాన్స్ వీడియోలతో ఆకట్టుకుంటూనే హాట్ హాట్ వర్కవుట్స్ చేస్తూ పర్ఫెక్ట్ ఫిట్‌నెస్‌తో ఆశ్చర్య పరుస్తుంటుంది. వెండితెరపై తల్లిగా, అక్కగా, వదినగా అలరిస్తూ సంప్రదాయ దుస్తుల్లో కనిపించే ప్రగతి.. నిజ జీవితంలో మాత్రం యమ హాట్‌గా కనిపిస్తూ ఆన్ లైన్ మాధ్యమాలను వేడెక్కిస్తుంటుంది. అయితే ఇదే విషయమై తాజాగా ఓ నెటిజన్ వేసిన ప్రశ్నపై ఆసక్తికరంగా బదులిచ్చింది ప్రగతి.

తాను ఇంట్లో, జిమ్ముల్లో చేస్తున్న వర్కవుట్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం హ్యాబీగా పెట్టుకున్న ప్రగతి.. రీసెంట్‌గా తన ఇన్స్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది. యంగ్ హీరోయిన్లు సైతం బిత్తరపోయేలా ఫుల్ ఎనర్జీతో ఈ వీడియోలో కనిపించింది ప్రగతి. దీంతో ఈ క్లిప్ నెట్టింట వైరల్ అయింది. ఇక ఈ వీడియోపై 'కొన్నిసార్లు మీరు వంతెన తెంచేసి మరీ ఈత నేర్చుకోవాలి. వర్కవుట్స్ అనేవి మనలో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తాయి' అని ట్యాగ్ చేసింది ప్రగతి.
కూతురు మరణంపై అన్నపూర్ణ షాకింగ్ కామెంట్స్.. తెల్లారేసరికి అలా! ఆమె చావుకు కారణం అదేనంటూ ఓపెన్
సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తున్న ఈ వీడియోపై నెటిజన్స్ పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఈ వయసులో కూడా వాట్ ఏ ఎనర్జీ అంటూ కితాబిస్తున్నారు. అయితే ఓ నెటిజన్ మాత్రం 'మీరు ఇంత కష్టపడుతున్నా సన్నబడటం లేదేంటి మేడం?' అని ప్రశ్నించడంతో దానిపై ప్రగతి రియాక్ట్ అయింది. వర్కవుట్స్ అనేవి సన్నబడటం కోసం కాదు.. శారీరకంగా, మానసికంగా దృఢంగా కావడానికి అంటూ బదులిచ్చింది. ఇదిలా ఉంటే, మరోవైపు ఈ సారి బిగ్ బాస్ హౌస్‌లో ప్రగతి హంగామా ఉండనుందనే టాక్ బలంగా వినిపిస్తోంది.
View this post on Instagram A post shared by Pragathi Mahavadi (@pragstrong) View this post on Instagram A post shared by Pragathi Mahavadi (@pragstrong) View this post on Instagram A post shared by Pragathi Mahavadi (@pragstrong) View this post on Instagram A post shared by Pragathi Mahavadi (@pragstrong)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

పెద్ద పారిశ్రామికవేత్తని బిల్డప్, చివరికి వీటిల్లోనూ కక్కుర్తి.. ఎంపీ గల్లాపై షాకింగ్ కామెంట్స్

Wed Jul 14 , 2021
తెలుగు దేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు.