హీరోతో గడపడం తప్పనిసరి! డైరెక్టుగా అడిగేవారు.. తెరవెనుక బాగోతాలంటూ బోల్డ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో లైంగిక వేధింపులు అనే అంశంపై రియాక్ట్ అవుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది బోల్డ్ బ్యూటీ మల్లికా శెరావత్. తనకు ఎన్నో ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయని ఆమె చెప్పుకొచ్చింది.

సినీ ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల ఆరోపణలు నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి. 'మీటూ' ఉద్యమం రావడం ఎన్నో నిజాలను బట్టబయలు చేసింది. ఎక్కడో హాలీవుడ్‌లో మొదలైన ఈ ఉద్యమ ప్రభావం క్రమంగా బాలీవుడ్‌లో ప్రవేశించి సంచనల విషయాలను వెలుగులోకి తెచ్చింది. మరోవైపు క్యాస్టింగ్ కౌచ్ అంటూ శ్రీ రెడ్డి చేసిన ఉద్యమం కూడా ఎంతో హీరోయిన్లను వెన్నుతట్టి తమకు ఎదురైన చేదు అనుభవాలను బయటపెట్టేలా చేసింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో లైంగిక వేధింపులు అనే అంశంపై రియాక్ట్ అవుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది బోల్డ్ బ్యూటీ మల్లికా శెరావత్.

2004 సంవత్సరంలో వచ్చిన ‘మర్డర్‌’ సినిమాతో బాలీవుడ్‌ ప్రేక్షకులకు దగ్గరైంది మల్లిక. ఇందులో బోల్డ్ సన్నివేశాల్లో నటించి ఆకట్టుకున్న ఈ భామ.. ఆ తర్వాత పలు సినిమాల ద్వారా మంచి గుర్తింపు సంపాదించింది. అయితే తెరవెనుక చనువుగా ఉండకపోవడం వల్లే తనను చాలా సినిమాల నుంచి తీసేశారని, తన ప్రతిభకు తగిన అవకాశాలు ఇవ్వలేదని గతంలోనే వెల్లడించిన మల్లికా.. మరోసారి అదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఓపెన్ అయింది.

ఇండస్ట్రీలో చాలా చేదు అనుభవాలు ఎదురయ్యాయని చెప్పిన మల్లికా శెరావత్.. కొందరు హీరోల కోరికలు తీర్చలేదని అవకాశాలు రాకుండా చేశారంటూ సంచలన ఆరోపణలు చేసింది. తన కెరీర్‌ ఆరంభంలో మీడియా ప్రభావం పెద్దగా లేదని, అప్పట్లో ఓ నటి నిలదొక్కుకోవాలంటే హీరోతో గడపడం తప్పనిసరి అన్నట్లు ఉండేదని ఆమె చెప్పింది. కావాలని బోల్డ్‌ సీన్లు పెట్టేవారని చెప్పిన ఆమె.. కెమెరా ముందు రొమాంటిక్‌గా చేసినప్పుడు నిజ జీవితంలో ఎందుకు కుదరదు? అని అడిగిన వాళ్ళు కూడా చాలామందే ఉన్నారని చెప్పుకొచ్చింది.
అలా గర్భం దాల్చిన మహేశ్ హీరోయిన్.. అసలు కారణం తెలిస్తే..
అయితే ఇలాంటి వాటికి తాను దూరంగా ఉండటం వల్లనే చాలా సినిమాల్లో అవకాశాలు కోల్పోయానని మల్లిక చెప్పడం గమనించాల్సిన విషయం. అంతేకాదు ఇండస్ట్రీలో నేటికీ అక్కడక్కడా అదే ధోరణి కనిపిస్తోందంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తనకు ‘బోల్డ్ నటి’ అని పేరు రావడానికి కారణం కూడా తోటి నటీనటులే అని మల్లిక శెరావత్ చెప్పింది.
హీరోలతో గడపడం తప్పనిసరి! డైరెక్టుగా అడిగేవారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

Rajasthan: రియల్ కుంభకర్ణుడు.. ఏడాదిలో 300 రోజులు నిద్రలోనే..

Wed Jul 14 , 2021
రాజస్థాన్‌కి చెందిన పూర్ఖారామ్ అనే వ్యక్తి సంవత్సరంలో 300 రోజులు నిద్రపోతాడు. దీనిపై పూర్ఖారామ్ స్పందిస్తూ.. ఈ అతి నిద్ర తన జీవితంలో 23 సంవత్సరాల క్రితం ప్రారంభమైందని తెలిపాడు. తాను మేల్కోవాలనుకున్నప్పుడల్లా.. అతని శరీరం తనకి సహకరించడం లేదని అన్నాడు.