సెట్‌లో అందరూ నన్ను ట్రై చేసేవారు.. పవన్ కళ్యాణ్ సైతం అలా.. నటి జ్యోతి కామెంట్స్

నటి జ్యోతి తాజాగా కొన్ని కామెంట్లు చేశారు. అందులో తన వ్యక్తిగత జీవితం గురించి చెబుతూ సినిమా సెట్‌లోని వాతావరణం గురించి చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ సైతం తన మీద కవిత్వం రాశారని చెబుతూ మురిసిపోయారు.

ప్రధానాంశాలు:సోషల్ మీడియాలో నటి జ్యోతి రచ్చడేటింగ్‌కు రెడీ అంటూ హల్చల్పవన్ కళ్యాణ్‌పై కామెంట్స్తెరపై బోల్డ్ పాత్రలు వేసి అందరినీ మెప్పించిన నటి జ్యోతి. బిగ్ బాస్ మొదటి సీజన్‌లో కనిపించి మరింత దగ్గరయ్యారు. అయితే జ్యోతి తన కెరీర్‌లో వేసిన పాత్రలన్నీ కాస్త మసాలా దట్టించినవే. వ్యాంప్ పాత్రలతోనే జ్యోతికి గుర్తింపు వచ్చింది. అయితే ప్రస్తుతం జ్యోతికి వెండితెర మీద అంతగా ఆఫర్లు రావడం లేదు. ఒకప్పుడు ఫుల్ బిజీగా ఉన్న జ్యోతి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నారు.

జ్యోతి వ్యక్తిగత జీవితం కూడా ఎప్పుడూ కాంట్రవర్సీ అవుతూనే ఉంటుంది. భర్తకు దూరంగా ఉంటూ కొడుకును పెంచుకుంటూ ఉన్నారు జ్యోతి. భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని అతని దగ్గరి నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని, తన డబ్బులతో బతుకుతున్నానని, పిల్లాడిని పోషించుకుంటున్నానని జ్యోతి చెప్పుకొచ్చారు.

అయితే తాజాగా మరో సీక్రెట్ బయటపెట్టేశారు జ్యోతి. పవన్ కళ్యాణ్ సెట్‌లో ఎక్కువగా మాట్లాడడని, తన పని ఏదో తాను చూసుకుంటాడని అందరూ చెబుతుంటారు. కానీ మొదటి సారిగా దానికి విరుద్దంగా జ్యోతి కామెంట్ చేశారు. సెట్స్‌లో అందరూ తననే ట్రై చేసేవారని, ఏదో విధంగా రకరకాలుగా ప్రయత్నాలతో ఇంప్రెస్ చేద్దామని ట్రై చేసేవారంటూ జ్యోతి చెప్పుకొచ్చారు.
ఈ కష్టకాలం నుంచి గట్టెక్కించేవి ఆ రెండే.. సమంత సలహాలు మామూలుగా లేవు!
అలా తన మీద పవన్ కళ్యాణ్ కవిత్వం కూడా రాసేశారని జ్యోతి సెన్సేషనల్ కామెంట్ చేశారు. దీంతో జ్యోతి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే ఇది గుడుంబా శంకర్ సినిమా షూటింగ్ సమయంలో జరిగి ఉంటుందని తెలుస్తోంది. ఎందుకంటే ఆ సినిమాలోనే జ్యోతి, పవన్ కళ్యాణ్ మధ్య కొన్ని సీన్స్ ఉన్నాయి. ఏది ఏమైనా జ్యోతి చేసిన కామెంట్లు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
ఫాంహౌస్‌లో పూనమ్ కౌర్ అంటూ నెటిజన్ సెటైర్.. చీప్ క్యారెక్టర్.. చిర్రెత్తిపోయిన పూనమ్ కౌర్
ఇక జ్యోతి ఇప్పుడు డేటింగ్ చేసేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. పెళ్లి సంగతి ఏమోగానీ డేటింగ్‌కు మాత్రం రెడీ అన్నట్టు కనిపిస్తోంది. సరైన వాడు దొరికితే డేటింగ్ చేస్తానని చెప్పుకొచ్చారు జ్యోతి. ప్రస్తుతం జ్యోతి బుల్లితెరపై కొన్ని షోల్లో అలా అలా మెరుస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

మరోసారి యశోద హాస్పిటల్‌కి కేసీఆర్?... లాక్‌డౌన్‌పై రెండ్రోజుల్లో కీలక నిర్ణయం

Mon Apr 26 , 2021
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి యశోద హాస్పిటల్‌కి వెళ్లనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో మరోసారి కోవిడ్ టెస్ట్ చేస్తే నెగిటివ్ వస్తుందని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు.