Mouni Roy: న‌న్ను నా భార్య‌ను వాడుకుందంటూ హీరోయిన్ మౌనీ రాయ్‌పై న‌టుడి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

Mouni Roy – Amit Tandon: హీరోయిన్ మౌనీ రాయ్‌పై నటుడు అమిత్ టాండన్ సంచలన ఆరోపణలు చేశాడు. తనను క్షమించే ప్రసక్తి లేదన్నాడు. తనను, తన భార్యను మౌనీ రాయ్ వాడుకుందని చెప్పాడు అమిత్.

ప్రధానాంశాలు:మౌనీరాయ్‌పై అమిత్ ఆగ్రహంతనను, తన భార్యను వాడుకుందని ఆరోపణక్షమించే ప్రసక్తి లేదన్న అమిత్ టాండన్అటు బుల్లితెర‌, ఇటు వెండితెర‌, మ్యూజిక్ వీడియోల్లో న‌టిస్తూ త‌న‌కంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్న బాలీవుడ్ హీరోయిన్ మౌనీరాయ్‌పై న‌టుడు అమిత్ టాండ‌న్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. నిజానికి ఒక‌ప్పుడు అమిత్ టాండ‌న్ భార్య రూబీ, మౌనీ రాయ్ చాలా మంచి స్నేహితులు. కానీ రూబీ కొన్నాళ్లు ముందు దుబాయ్‌లో అరెస్ట్ అయ్యింది. అప్ప‌టి నుంచి రూబీ, అమిత్ టాండ‌న్‌ల‌తో మౌనీరాయ్‌కు గొడ‌వలు మొద‌ల‌య్యాయి. మీడియాలో దీనికి సంబంధించి ఎన్ని ర‌కాలు వార్త‌లు వ‌చ్చినా ఇరు వ‌ర్గాల వాళ్లు నోళ్లు మెద‌ప‌లేదు. అయితే రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో మౌనీ రాయ్‌పై అమిత్ టాండ‌న్ త‌న ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశాడు.

రూబీతో స్నేహంగా ఉన్నప్పుడు మౌనీరాయ్ నా భార్య‌ను ఆమె అవ‌స‌రాల‌కు వాడుకుంది. అదే ఆమె అవ‌స‌రం మాకు కావాల్సిన‌ప్పుడు మాత్రం ప‌ట్టించుకోలేదు. రూబీ త‌న‌ను చాలా బాగా న‌మ్మింది. అయితే మౌనీరాయ్ మాత్రం అనుకున్నంత నిజాయ‌తీప‌రురాలు కాదు. దుబాయ్ జైలులో రూబీ ఉన్నప్పుడు మౌనీ రాయ్ ప్ర‌వ‌ర్తనేంటో తెలిసింది. ఆమె అలా ప్ర‌వ‌ర్తించ‌డంతో మా హృద‌యాలు గాయ‌ప‌డ్డాయి. ఆమె మాతో క‌లిసి తిరిగిన మౌనీరాయేనా అనిపించింది. త‌న ప్ర‌వర్త‌న‌లో అంత మార్పు క‌నిపించింది.

స్నేహితులు ప‌డిపోయినప్పుడు మ‌నం చేయి అందించాలి. నా భార్య చేసిన ప‌నిని మౌనీ చేయ‌లేక‌పోయింది. అయితేనేం, రూబీ మ‌ళ్లీ శ‌క్తివంతంగా లేచినిల‌బ‌డింది. మౌనీరాయ్‌ను క్ష‌మించ‌డం జ‌ర‌గ‌దు. ఒక‌వేళ ఆమెతో స్నేహం చేస్తే మ‌న బంధం తెగిపోతుంద‌ని నా భార్య‌తో చెప్పాను. 2017లో దుబాయ్‌కు వెళ్లిన రూబీ అక్క‌డ అధికారుల‌ను బెదిరించింద‌నే కార‌ణంతో అరెస్ట్ అయ్యింది. 2019లో ఇండియా తిరిగొచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

11 రోజుల్లోనే డబ్బు రెట్టింపు.. రూ.లక్షకు రూ.2 లక్షలు!

Sat Sep 18 , 2021
మీకు వొడాఫోన్ ఐడియా గురించి తెలుసా? ఈ కంపెనీ రుణ భారంతో సతమతమౌతోంది. అయితే ఇన్వెస్టర్లకు మాత్రం అదిరే రాబడిని అందించింది. కేవలం 11 రోజుల్లోనే డబ్బులు రెట్టింపు చేసింది.