ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్రం అదిరిపోయే శుభవార్త.. కీలక నిర్ణయం!

మోదీ సర్కార్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు అందించింది. డియన్‌నెస్ అలవెన్స్ పెంపునకు ఆమోదం తెలిపింది. దీంతో లక్షల మంది ఉద్యోగులకు, పెన్షనర్లకు ఊరట కలుగనుంది.

ప్రధానాంశాలు:మోదీ సర్కార్ కీలక నిర్ణయండీఏ పెంపునకు ఆమోదంఉద్యోగులకు, పెన్షనర్లకు ఊరటకేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు తీపికబురు అందించింది. ఊరట కలిగే నిర్ణయం తీసుకుంది. డియర్‌నెస్ అలవెన్స్ DA కు సంబంధించి కీలక ప్రకటన చేయనుందని తెలుస్తోంది. దీంతో లక్షల మంది ఉద్యోగులకు, పెన్షనర్లకు ఊరట కలుగనుంది. వేతనాలు పెరగనున్నాయి.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర కేబినెట్ బుధవారం డీఏ పెంపునకు ఆమోదం తెలిపిందని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ఉద్యోగులకు డీఏ 17 శాతం నుంచి 28 శాతానికి పెరిగింది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కొద్దిసేపట్లో వెలువడనుంది.

Also Read: Modi అదిరే స్కీమ్.. రూ.12 కడితే రూ.2 లక్షల బెనిఫిట్.. ఇలా చేరండి!

కేంద్ర ప్రభుత్వం గత ఏడాది నుంచి ఉద్యోగులకు డీఏ పెంపును నిలిపివేసిన విషయం తెలిసిందే. అలాగే పెన్షనర్లకు కూడా డీఆర్ పెంపు లేదు. మూడు ఇన్‌స్టాల్‌మెంట్ల డీఏ ఉద్యోగులకు లభించాల్సి ఉంది. కరోనా వైరస్ కారణంగా మోదీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.

2020 జనవరి 1 నుంచి జూన్ 30 వరకు 4 శాతం డీఏ, 2020 జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు 3 శాతం డీఏ, 2021 జనవరి 1 నుంచి జూన్ 30 వరకు 4 శాతం డీఏ ఉద్యోగులకు అందాల్సి ఉంది. అంటే మొత్తంగా చెప్పాలంటే ఇప్పుడు ఉద్యోగుల డీఏ 28 శాతానికి పెరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఈటల రాజేందర్ చేసిన తప్పు అదే.. మంత్రి KTR ఆసక్తికర వ్యాఖ్యలు

Wed Jul 14 , 2021
TRS Party: బండి సంజయ్ గురించి విమర్శలు చేస్తూ.. ఆయన అసలు పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. ఏడేళ్లలో కేంద్రం దేశంలో ఏం చేసిందో చెప్పే ధైర్యం బీజేపీ నేతలకు ఉందా? అని ప్రశ్నించారు.