బంగ్లాదేశ్: ఫుడ్ ఫ్యాక్టరీలో ఘోర అగ్ని ప్రమాదం.. 52 మంది సజీవదహనం

ఆహార పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుని 52 మంది సజీవదహనమైన ఘటన బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం ఈ ఘటన జరిగినా మంటలు ఇంకా కొనసాగుతున్నాయి.

ప్రధానాంశాలు:24 గంటలైనా అదుపులోకి రాని మంటలు.పరిశ్రమ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలు.లోపల మరికొందరు చిక్కుకున్నట్టు అనుమానాలు.బంగ్లాదేశ్‌లో ఘో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 52 మంది సజీవదహనమయ్యారు. రాజధాని ఢాకా శివారు ప్రాంతంలోని హషీమ్ ఫుడ్ ఫ్యాక్టరీలో ఈ అగ్నిప్రమాద చోటుచేసుకుంది. రూప్ గంజ్ ప్రాంతంలోని ఆరు అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరిశ్రమలోని సిబ్బంది పెద్దసంఖ్యలో చిక్కుకుపోయారు. ఇప్పటివరకు 52 మృతదేహాలను వెలికితీయగా.. మరో 30 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఘటన జరిగిన సమయంలో చాలా మంది కార్మికులు భవనం పై అంతస్తుల నుంచి కిందికి దూకి గాయాలపాలయ్యారు.

మంటలు భారీగా ఎగిసిపడటంతో చుట్టుపక్కలవారు భయభ్రాంతులకు గురవుతున్నారు. సహాయ చర్యలు కొనసాగుతుండగా.. లోపల చిక్కుకున్న తమవారి కోసం కార్మికులు, బంధువులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. తాజా ప్రమాదం బంగ్లాదేశ్‌లోని పరిశ్రమలు, నివాస భవనాలలో భద్రతాలోపాన్ని మరోసారి బయటపెట్టింది. 2013లో ఢాకాలోని రానా ప్లాజా వద్ద తొమ్మిదంతస్తుల భవనం కూలి 1,000 మందికిపైగా చనిపోయారు. అలాగే, 2019లో ఓ భవనంలో నిల్వ ఉంచిన రసాయనాలు పేలి 70 మంది ప్రాణాలు కోల్పోయారు.

రూప్ గంజ్‌లో గురువారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగ్గా.. 24 గంటలైనా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. పరిశ్రమలో 1000 మందికిపైగా కార్మికులు పనిచేస్తుండగా.. ప్రమాదం జరిగిన వెంటనే చాలా మంది బయటపడ్డారు. తొలుత ముగ్గురు చనిపోయినట్టు ప్రకటించినా.. తర్వాత మరో 49 మృతదేహాలు బయటపడ్డాయి.

స్థానిక అగ్నిమాక అధికారి దేబశీష్ బర్దాన్ మాట్లాడుతూ.. ‘మెట్ల మార్గం వద్ద ఎగ్జిట్ ద్వారం లాక్ చేసిన ఉండటంతో కార్మికులు పైకి వెళ్లలేకపోయారు.. అలాగే, కింది అంతస్తుల్లో వెళ్లాదంటే అప్పటికే మంటలు వ్యాపించాయి’ అని అన్నారు. తాళ్ల సాయంతో కొంత మందిని కిందకు దించినట్టు తెలిపారు. మంటలు ఇంకా అదుపులోకి రాలేదని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత లోపలి సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తామన్నారు.

పరిశ్రమ లోపల మండే స్వభావం కలిగిన రసాయనాలు, ప్లాస్టిక్ నిల్వలే ప్రమాదానికి కారణమని భావిస్తున్నట్టు ఢాకా ఫైర్ విభాగం చీఫ్ దిను మోని శర్మ తెలిపారు. లోపలి డజన్ల కొద్దీ కార్మికులు చిక్కుకున్నారని ప్రమాదం నుంచి బయటపడిన మహమ్మద్ సైఫుల్ అనే ఓ కార్మికుడు తెలిపారు. మూడో అంతస్తు మెట్ల మార్గంలో తలుపులు మూసుకున్నాయని, లోపలి 48 మంది వరకు ఉన్నట్టు సహచరులు చెబుతున్నారని అన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

యూపీలో కొత్తరకం కరోనా కలకలం.. తొలిసారి ‘కప్పా’ వేరియంట్ కేసులు

Fri Jul 9 , 2021
Delta Variant కరోనా మహమ్మారి రోజుకో కొత్త రూపం దాల్చి యాంటీబాడీలను ఏమార్చుతోందని పలు పరిశోధనలు వెల్లడించాయి. తాజాగా, దేశంలో మరోసారి కరోనా మ్యుటేషన్ చెందినట్టు గుర్తించారు.