పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలపై గత కొంతకాలంగా నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఓవైపు కరోనాతో దేశం అల్లకల్లోలం అవుతుంటే.. విదేశీ పర్యటనలకు వెళ్లిన కొందరిపై సోషల్‌మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో ఓ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ పెట్టిన హీరోయిన్ కరీనా కపూర్ నెటిజన్లు ఆగ్రహానికి గురైంది.

రొటీన్‌కి భిన్నంగా క్లాసిక్ సినిమాలు రూపొందించే దర్శకుల్లో శేఖర్ కమ్ముల ముందు వరుసలో ఉంటాడు. తన మొదటి చిత్రం నుంచి రీసెంట్ సినిమా ‘ఫిదా’ వరకూ అన్ని యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేస్తాయి. అయితే తన లేటెస్ట్ చిత్రం ‘లవ్‌స్టోరీ’ విషయంలో శేఖర్ కమ్ముల దర్శకధీరుడు ఎస్ఎస్‌ రాజమౌళిని ఫాలో అవుతున్నారట.

ఎస్‌జే సూర్య డైరెక్షన్‌లో పవన్‌కళ్యాణ్, భూమిక హీరోహీరోయిన్లుగా నటించిన ‘ఖుషి’ తెలుగు సినిమా చరిత్రలోనే ఒక క్లాసిక్ చిత్రం. ఈ చిత్రం విడుదలై 20 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఆ సినిమాలో ‘మధు’ పాత్రలో నటించిన భూమిక తన రియాక్షన్‌ను తెలిపింది.

ఇటీవల ‘వకీల్‌సాబ్’ సినిమాతో తెలుగు వెండితెరపై రీఎంట్రీ ఇచ్చారు పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్. అయితే ఈ సినిమా విడుదలైన కొన్ని రోజులకే ఆయన కరోనా బారిన పడ్డారు. కొన్ని రోజులు ఐసోలేషన్‌లో చికిత్స తీసుకున్న తర్వాత పవన్‌ వైరస్ నుంచి కోలుకున్నారు. కానీ, ఆయన ఇంకా అనారోగ్యంగానే ఉన్నారని వైద్యులు చెబుతున్నారు.

ఏబీఎన్- ఆంధ్రజ్యోతి మీడియా సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి పరామర్శించారు.

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో మనదేశంలో కొత్త 5జీ ఫోన్‌ను లాంచ్ చేసింది. అదే ఒప్పో ఏ53ఎస్ 5జీ. దీని ధర రూ.14,990గా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఇందులో ఉన్నాయి.

కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మంగళవారం హనుమాన్ జయంతి వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. భారీ ర్యాలీలు, జన సమూహాలు లేకుండా చూసుకుంటూ.. దేవాలయాల్లో ప్రశాంతంగా పూజలు నిర్వహిస్తున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి హనుమాన్ జయంతి గురించి ఓ ఆసక్తికర ట్వీట్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు.

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, లౌక్యం, నాన్నకి ప్రేమతో, సరైనోడు, ధృవ, రారండోయ్ వేడుక చూద్దాం, జయ జానకీ నాయకా ఇలా రకుల్ ప్రీత్ సింగ్ లిస్ట్‌లో హిట్లు ఉన్నా.. కేవలం గ్లామర్ హీరోయిన్‌‌కి మాత్రమే పరిమితం అయ్యింది. నటిగా అబ్బా ఏం చేసింది రా బాబూ అనేలా నటనలో వైవిధ్యాన్ని ప్రదర్శించలేకపోయింది.

పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' సినిమా ఓటీటీ వేదికపై ప్రసారం కాబోతోంది. ఈ మేరకు అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.