అమితాబ్ బచ్చన్‌ మరోసారి సర్జరీ చేయించుకోబోతున్నారట. తన బ్లాగ్ ద్వారా ఆయనే స్వయంగా ఈ విషయం వెల్లడించడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటున్నారు.

బిపాస, కరణ్ ‘ఎలోన్’ సినిమాలో కలిసి నటించారు. అప్పుడే వీరు ప్రేమలో పడ్డారు. కొన్నాళ్ల పాటు సహ జీవనం చేసిన తరవాత 2016 ఏప్రిల్ 30న వీరు వివాహం చేసుకున్నారు. బాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది.

ప్రియాంక చోప్రా గర్భం దాల్చారని చెబుతూ కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోల్లో ప్రియాంక మేకప్ లేకుండా, కాజువల్ డ్రెస్‌లో కాస్త బొద్దుగా కనిపిస్తున్నారు. గర్భం దాల్చడం వల్లే ఆమె బరువు పెరిగారని కొంత మంది ఆరోపణ.

ఒక్కోసారి షూటింగ్స్ చేస్తుంటే ఊహించని ఘటనలు చోటుచేసుకుంటాయి. తాజాగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌ షూటింగ్‌లో అదే జరిగింది. కొందరు వ్యక్తులు షూటింగ్ సెట్‌పై రాళ్లదాడి చేశారు.