మొత్తం 40 దేశాల నుంచి 700 మందికిపైగా పాల్గొన్న అందాల పోటీలో భారతీయ అమెరికన్ టీనేజర్ నిత్య కొడాలి విజేతగా నిలిచింది. తొలిసారిగా నిర్వహించిన మిస్ టీన్ తెలుగు యూనివర్స్ కీరటం సొంతం చేసుకుంది.

మీరు జీఎస్‌టీ చెల్లిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. జీఎస్‌టీ వార్షిక రిటర్న్స్ దాఖలుకు గడువు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో చాలా మందికి ఊరట కలుగనుంది.

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగే ప్రకటన చేసింది. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో చాలా మందికి ఊరట కలుగుతుంది.

ఈ ఫీచర్ ప్యాకెడ్ స్మార్ట్‌ఫోన్ 6GB RAM, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ & 6GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులో ఉన్న ఆ ఫీచర్లు ఏంటో ఇక్కడ తెలుసుకోండి.

ఫ్లిప్ కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ ఆఫర్ సేల్ రేపటి(అక్టోబర్ 16వ తేదీ) నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సేల్‌లో మంచి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. ఫ్లిప్ కార్ట్‌లో ప్రస్తుతం ఎన్నో స్మార్ట్ ఫోన్లపై తగ్గింపును అందించారు. అక్కడ ఉన్న ఎన్నో మొబైల్స్ నుంచి డీల్స్‌ను ఎంచుకోవడం కూడా కష్టమే. ఫ్లిప్ కార్ట్‌లో ప్రస్తుతం ఉన్న బడ్జెట్ ఫోన్లలో భారీ తగ్గింపు అందుకున్న టాప్-5 ఫోన్లు ఇవే!

వన్ ప్లస్ తన కొత్త స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ 8టీని మనదేశంలో లాంచ్ అయింది. ఈ ఫోన్ ధర రూ.42,999 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో 6.55 అంగుళాల ఫ్లూయిడ్ సూపర్ అమోఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. అక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో వెనకవైపు 48 మెగా పిక్సెల్ + 16 మెగా పిక్సెల్ + 5 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న నాలుగు కెమెరాలు అందించారు. సెల్పీ కెమెరా సామర్థ్యం 16 మెగాపిక్సెల్ గా ఉంది. ఇందులో 4500 ఎంఏహెచ్ బ్యాటరీని వన్ ప్లస్ అందించింది. 65W ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ కూడా ఇందులో ఉండటం విశేషం.

పోర్చుగల్, ఫ్రాన్స్ మధ్య సోమవారం మ్యాచ్ జరగగా.. మ్యాచ్ డ్రాగా ముగిసిన తర్వాత పోర్చుగల్ టీమ్‌ సభ్యులతో కలిసి క్రిస్టియానో రొనాల్డో సెల్ఫీ తీసుకున్నాడు. కానీ.. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే అతనికి కరోనా పాజిటివ్‌గా తేలింది.

Samsung Galaxy F41 ప్రీమియం గ్రేడియంట్ ఫినిష్‌తో చూడడానికి చాలా ఫంకీగా ఉంటుంది. ఈ డివైస్ Fusion Blue, Fusion Green మరియు classic Fusion Black రంగులలో అందుబాటులో ఉంటుంది. బోలెడన్ని ఫీచర్లతో రానున్న ఈ మొబైల్ ధర ఎంతో తెలుసా?

గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాడ్మింటన్ ప్లేయర్లకి తన అకాడమీ ద్వారా అంతర్జాతీయ స్థాయి శిక్షణ ఇవ్వాలని ఆశిస్తున్న గుత్తా జ్వాలా ఈ రోజు మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్‌ని కలిశారు. ఈ మేరకు మంత్రి ముందు ఆమె కీలక ప్రతిపాదనలు ఉంచారు.

వాట్సాప్ ఎక్కువగా ఉపయోగించేవారు, ముఖ్యంగా మహిళలు కొన్ని సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అయితే మనం కొన్ని టిప్స్ పాటిస్తే వాట్సాప్‌లో కూడా సేఫ్‌గా ఉండవచ్చు. అపరిచితుల నుంచి వచ్చే వీడియో కాల్స్ ఎత్తకుండా ఉండటం, ఒకవేళ ఎత్తాల్సి వస్తే మీ సెల్ఫీ కెమెరాను వేలితో బ్లాక్ చేయడం, +91 కాకుండా ఇతర నంబర్ల నుంచి వచ్చే కాల్స్ లిఫ్ట్ చేయకుండా ఉండటం, మీ ప్రొఫైల్ పిక్చర్, స్టేటస్ మెసేజ్ మీ కాంటాక్ట్స్‌లో ఉన్న వారు మాత్రమే చూసేలా సెట్ చేసుకోవడం, మీ కాంటాక్ట్స్‌లో ఉన్నప్పటికీ మీరు వాట్సాప్‌లో చాట్ చేయని వారిని బ్లాక్ చేయడం, గ్రూపుల్లో ఎవరు పడితే వారు యాడ్ చేయకుండా సెట్టింగ్స్ మార్చుకోవడం వంటివి చేయడం ద్వారా వాటిని ఎదుర్కోవచ్చు.