ప్రేమ ఎక్కడా ఉన్నా .. ఇక్కడ రావమ్మా అంటోంది.. బిగ్‌బాస్3 ఫేమ్ పునర్నవి భూపాళం. తను ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న సైకిల్ చిత్రంలోనిది ఈ పాట. శ్రీపాద చిన్మయి వాయిస్‌ కూడా తోడవగా.. ఈ సాంగ్‌కు మ్యూజిక్ లవర్స్‌కి ఎంతగానో నచ్చింది.

'నీకోసం నువ్వు బతికితే.. పుట్టే వేస్టూ' అంటున్నాడు… సాయిధరమ్ తేజ్. నీ ఊరు మెచ్చేట్టూ.. నీకు పేరు వచ్చేట్టూ బతకాలి అంటూ 'తకిట తకిట' సాంగ్‌తో గుర్తుచేస్తున్నాడు. తమన్ బీట్ 'తకిట తకిట' అదిరింది. రాహుల్ సిప్లీగంజ్, గీతామాధురి మరోసారి దుమ్ములేపారు.

అమెరికాలో ఉన్నత విద్యకోసం కలలకంటున్న విద్యార్థుల బలహీనతలను ఆసరాగా తీసుకుని దళారులు రెచ్చిపోతున్నారు. వారిని తమ ఉచ్చులోకి లాగి నిలువునా దోచుకుంటూ ఇరకాటంలోకి నెట్టేస్తున్నారు.

ఓ రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన గ్యాంగ్‌లీడర్ మూవీ ఫ్యామిలీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టకుంది. ప్రియాంక అరుల్ మోహన్, నానీల కెమిస్ట్రీ అలరించింది. ఈ చిత్రంలోని నిన్ను చూసే ఆనందంలో సాంగ్ ఎంత హిట్టయ్యిందో తెలిసిందే. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతానికి… సిద్ శ్రీరామ్ గాత్రం… వినసొంపైన అనంత శ్రీరామ్ లిరిక్స్ తోడై శ్రోతలను మరో ప్రపంచానికి తీసుకెళ్లాయి.

అమెరికన్ కమ్యూనిటీ సర్వే ప్రకారం.. అగ్రరాజ్యంలో భారతీయ సంతతి జనాభా గత ఎనిమిదేళ్లలో 9 లక్షల మేర పెరిగింది. అలాగే ఈ 30 ఏళ్లలో వీరి పెరుగుదల 489 శాతం నమోదుకావడం విశేషం.

విదేశాల నుంచి వచ్చిన ఓ బావ తన మరదలి మనసు గెలవడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు. అయిన ఆమె మాత్రం బెట్టు చేస్తుంది. కజిన్స్ అంతా కల్సి..బావను పెళ్లి చేస్కో…ఎంత మంచోడో అంటూ అక్కకు చెప్పే.. ఈ 'ఓ బావ' పాట 'ప్రతిరోజు పండగే' చిత్రంలోనిది.

కేంద్ర ప్రభుత్వం తాజాగా జీఎస్‌టీ చెల్లింపుదారులకు తీపికబురు అందించింది. జీఎస్‌టీ వార్షిక రిటర్న్స్ దాఖలుకు గడువు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో జీఎస్‌టీ చెల్లింపుదారులకు ఎక్కువ గడువు లభించింది.

హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు ఉద్యోగవకాశాలను కల్పిస్తూ గతంలో ఒబమా ప్రభుత్వం తీసుకొచ్చిన హెచ్-4 వీసాలను రద్దు చేయాలన్న ట్రంప్‌ ఆదేశాలకు కోర్టు బ్రేక్‌లు వేసింది.

పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది. జీఎస్‌టీ సహా ఇతర పరోక్ష పన్నులు చెల్లించేవారికి ఇది వర్తిస్తుంది. ఇప్పటికే ప్రత్యక్ష పన్ను చెల్లింపుదారులకు ఈ ఫెసిలిటీ అందుబాటులో ఉంది.

రామజోగయ్య శాస్త్రి చాలా మంచి సాహిత్యాన్ని అందించారు. పాటలోని ప్రతి వాక్యం ఎంతో అందంగా ఉంది. మామా అల్లుళ్ల మధ్య అనుబంధాన్ని ఎంతో చక్కగా చెప్పారు ఈ పాటలో.